ETV Bharat / city

మంత్రి కొట్టు సత్యనారాయణను ఘోరావ్‌ చేసిన నాయి బ్రాహ్మణులు

author img

By

Published : Aug 23, 2022, 9:18 PM IST

Barbers protest గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయాలంటూ దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఘోరావ్‌ చేశారు. ఆలయాల్లో పని చేస్తున్న క్షౌరకులకు కనీసం వేతనం ఇవ్వాలని నిర్ణయిస్తూ సిద్దం చేసిన జీవోను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

మంత్రి కొట్టు సత్యనారాయణను ఘోరావ్‌ చేసిన నాయి బ్రాహ్మణులు
మంత్రి కొట్టు సత్యనారాయణను ఘోరావ్‌ చేసిన నాయి బ్రాహ్మణులు

Minister Kottu Satyanarayana: దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణను నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఘోరావ్‌ చేశారు. మాజీమంత్రి వెలంపల్లి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలంటూ విజయవాడ గొల్లపూడిలోని దేవదాయశాఖ కమిషనరేట్‌ కార్యాలయం వద్దకు నాయిబ్రాహ్మణులు వచ్చారు. అక్కడ మంత్రి కొట్టు కారు వద్ద అడ్డంగా నిలిచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఆలయాల్లో పని చేస్తున్న క్షౌరకులకు కనీసం వేతనం ఇవ్వాలని నిర్ణయిస్తూ సిద్దం చేసిన జీవోను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిశీలిస్తామని మంత్రి చెప్పినా పరిస్థితిలో మార్పురాలేదు. పోలీసుల జోక్యంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మంత్రి కొట్టు సత్యనారాయణను ఘోరావ్‌ చేసిన నాయి బ్రాహ్మణులు

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.