ETV Bharat / city

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్​ న్యూస్​.. దర్శన టికెట్ల సంఖ్య పెంపు

author img

By

Published : Feb 22, 2022, 2:42 PM IST

Updated : Feb 22, 2022, 3:17 PM IST

తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంపు
తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంపు

14:37 February 22

TTD News: తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంపు

TTD: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం దర్శన టికెట్ల సంఖ్యను పెంచుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను రేపు(బుధవారం) విడుదల చేయనున్నట్లు తితిదే వెల్లడించింది. ఈ నెల 24 నుంచి అదనపు కోటా కింద 13వేల దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

అలాగే మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 25వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేపు ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మార్చి నెలకు సంబంధించి సర్వదర్శన టికెట్లను రోజుకు 20 వేలకు పెంచిన తితిదే.. నిత్యం 5 వేల చొప్పున అదనపు కోటా కింద జారీ చేయనున్నారు. తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్లు తితిదే వెల్లడించింది.

ఇదీ చదవండి: శ్రీవారి భక్తులకు సర్వదర్శన కష్టాలు.. చెట్ల కిందే పడిగాపులు

Last Updated : Feb 22, 2022, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.