ETV Bharat / city

Pushpayagam: తిరుమలలో వైభవంగా పుష్పయాగం

author img

By

Published : Nov 11, 2021, 11:48 AM IST

Updated : Nov 12, 2021, 7:02 AM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ(srivari Pushpayagam at tirumala) మహోత్సవాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. పుష్పయాగంలో భాగంగా.. ఆలయ కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. ఏడు టన్నుల పూలతో "పుష్ప కైంకర్యం"(pushpa kainkaryam) నిర్వహించారు.

తిరుమలలో వైభవంగా పుష్పయాగం
తిరుమలలో వైభవంగా పుష్పయాగం

srivari Pushpayagam updates
తిరుమలలో వైభవంగా శ్రీవారి పుష్పయాగం

కార్తికమాసం శ్రవణానక్షతం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారికి పుష్పయాగ మహోత్సవాన్ని(srivari Pushpayagam at tirumala) తితిదే వైభవంగా నిర్వహించింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సన్నిధి నుంచి కల్యాణమండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ ఉత్సవమూర్తులకు మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మద్య స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకించారు.

తిరుమలలో వైభవంగా పుష్పయాగం

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పుష్పకైంకర్యం(pushpa kainkaryam with seven tons of flowers at tirumala) నిర్వహించారు. ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామివారికి హృదయాన్ని తాకేవరకు పలుమార్లు పుష్పార్చన చేశారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతో పాటూ కర్ణాటక నుంచి ఏడు టన్నుల పూలను దాతలు విరాళంగా పంపారు. ఇందులో 14 రకాల కుసుమాలు, 6 రకాల పత్రాలు ఉన్నాయి. స్వామివారి పూలమాలలు తయారు చేసే భవనం వద్ద పూలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి తరలించారు. వర్షం కారణంగా పూల ఊరేగింపు లేకుండా.. వాహనాలలో ఆలయానికి తీసుకెళ్లారు.

శ్రీవారి సేవలో పలువురు..
తిరుమల శ్రీవారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి(minister peddireddy and mp mithun reddy visit tirumala) దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తితిదే ఆధికారులు(ttd) స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి..

RAINS: రాష్ట్రంలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు

Last Updated :Nov 12, 2021, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.