ETV Bharat / city

శ్రీకాళహస్తి విగ్రహాల కేసును ఛేదించిన పోలీసులు...ముగ్గురు అరెస్ట్

author img

By

Published : Sep 22, 2020, 12:26 PM IST

Updated : Sep 22, 2020, 3:48 PM IST

srikalahasti-temple
srikalahasti-temple

12:23 September 22

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో అనధికార విగ్రహాల కేసును తిరుపతి అర్బన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వ్యక్తిగత సమస్యలు, మూఢనమ్మకాల కారణంగా నిందితులు విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు.

శ్రీకాళహస్తి విగ్రహాల కేసును ఛేదించిన పోలీసులు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో అనధికారికంగా విగ్రహాలు ఏర్పాటు చేసిన కేసులో నిందితులను తిరుపతి అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి అర్బన్ పోలీస్ కార్యాలయంలో మాట్లాడిన అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన పుత్తూరుకు చెందిన సులవర్థన్, తిరుమలయ్య, మునిశేఖర్ అనే ముగ్గురు సోదరులు.... శ్రీకాళహస్తి ఆలయంలో అనధికారికంగా శివలింగం, నంది విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు.  

స్వామీజీ కోసం గాలింపు

వ్యక్తిగత సమస్యలు, మూఢనమ్మకాల కారణంగానే నిందితులు ఆలయంలో విగ్రహాలను ఏర్పాటు చేశారన్నారు.  సీసీటీవీ ఫుటేజ్, ద్విచక్రవాహనాల నెంబర్ల ఆధారంగా కేసును ఛేదించగలిగామని ఎస్పీ తెలిపారు. ఈ నెల 2వ తేదీన తిరుపతిలో నిందితులు శివలింగం, నందీశ్వరుని ప్రతిమలు చేయించినట్లు తేలిందన్నారు. వీరికి గుడిలో విగ్రహాలను ప్రతిష్ఠించాలని సలహా ఇచ్చిన స్వామీజీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖ తీరంలో సందిగ్ధం.. అమోనియం నైట్రేట్ దిగుమ‌తిపై అయోమయం!

Last Updated : Sep 22, 2020, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.