ETV Bharat / city

ఆన్ లైన్ మోసాలు.. రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్న బాధితులు!

author img

By

Published : Apr 2, 2022, 6:56 PM IST

Online cheating
Online cheating

Online cheating: అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకుంటున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లికి చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కూడా ఇదే తరహాలో మోసపోయారు..!

Online cheating: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లికి చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి వర్క్ ఫ్రం హోం పేరుతో వేసిన గాలానికి చిక్కి.. 20లక్షలు మోసపోయాడు. అతని ఫోన్​కు వర్క్ ఫ్రం హోం పేరుతో లింకు వస్తే.. ఆ లింకును క్లిక్ చేసి అందులో ఉన్న టాస్కులు పూర్తి చేశాడు. మొదట 100 రూపాయలు అతని అకౌంట్ నుంచి కట్ అయ్యాయి. అక్కడి నుంచి మొదలైన వ్యవహారం.. రూ.20 లక్షల వరకు చేరింది..! పోయిన 20 లక్షలకు గానూ.. 40 లక్షలు వచ్చినట్లు బాధితుడికి మెసేజ్ వచ్చింది. అయితే.. రూ.40 లక్షలు ఇవ్వడానికి ట్యాక్స్ చెల్లించాలని, అందుకు రూ.8 లక్షలు చెల్లించాలని మరో మెసేజ్ వచ్చింది. అప్పుడు తాను మోసపోయినట్లు గ్రహించిన సదరు వ్యక్తి.. చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆన్ లైన్ మోసాలు...లక్షల్లో డబ్బుపోగొట్టుకుంటున్న బాధితులు...

ఇదీ చదవండి : Variety thief arrested: రాత్రికి కలగనటం.. ఉదయాన్నే దొంగతనం చేయటం.. ఇదీ ఓ దొంగ మానరిజం.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.