ETV Bharat / city

తితిదే ఒక వ్యక్తి.. ఆ సమాచారం ఇవ్వలేం..!: ఆర్బీఐ

author img

By

Published : Aug 26, 2021, 8:26 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రిజర్వు బ్యాంక్ ఒక వ్యక్తిగా నిర్ధరించింది. గడువు తర్వాత తితిదే హుండీలో వేసిన రూ.51 కోట్ల విలువైన పెద్ద నోట్లు, రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యలు, దీనిపై కేంద్ర ఆర్థిక శాఖతో జరిపిన సమాచారం ఇవ్వాలంటూ ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ కోరారు. వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐలోని సెక్షన్ 8(1) ఐ కింద ఇవ్వలేమంటూ ఆర్బీఐ తోసిపుచ్చింది.

RBI treated ttd as an individua
RBI treated ttd as an individua

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రిజర్వు బ్యాంక్ ఒక వ్యక్తిగా నిర్ధరించింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సంబంధించి ఆర్బీఐ ఈ సమాధానం ఇచ్చింది. వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఇవ్వలేమంటూ సమాచార హక్కు చట్టం కార్యకర్త ఇనుగంటి రవికుమార్​కు ఆర్బీఐ ముఖ్య సమాచార అధికారి సుబ్రతాదాస్ సమాధానం ఇచ్చారు. నోట్ల రద్దు తర్వాత శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించిన రూ.51 కోట్ల విలువైన పెద్ద నోట్ల విషయంలో రిజర్వు బ్యాంకు ఈ జవాబు ఇచ్చింది.

గడువు తర్వాత తితిదే హుండీలో వేసిన రూ.51 కోట్ల విలువైన పెద్ద నోట్లు, రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యలు, దీనిపై కేంద్ర ఆర్థిక శాఖతో జరిపిన సమాచారం ఇవ్వాలంటూ ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ కోరారు. వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐలోని సెక్షన్ 8(1) ఐ కింద ఇవ్వలేమంటూ ఆర్బీఐ తోసిపుచ్చింది. దరఖాస్తుదారు, ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ మరోవ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం అడిగారంటూ అందులో పేర్కొన్నారు.

ఆర్టీఐ దరఖాస్తులో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డుకు సంబంధించిన సమాచారం కోరితే ఆ సంస్థను వ్యక్తిగా పేర్కోంటూ రిజర్వు బ్యాంకు సమాధానం ఇచ్చింది. 1932లో తితిదే చట్టం కింద ట్రస్టుగా ఏర్పాటైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని.. సంస్థగా రిజర్వు బ్యాంకు గుర్తించకపోవటం విశేషం. దీంతో పాటు డీమానిటైజేషన్ గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ట్రస్టులకు పాతకరెన్సీని మార్చి ఇచ్చారా అంటూ కోరిన సమాచారానికి రిజర్వు బ్యాంకు వివరాలను ఇవ్వలేదని ఆర్టీఐ కార్యకర్త ఇనుగంటి రవికుమార్ వెల్లడించారు.

ఇదీ చదవండి:

KRMB, GRMB MEETING: సెప్టెంబర్‌ 1న కృష్ణా, గోదావరి బోర్డుల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.