ETV Bharat / city

KABADDI : తిరుపతిలోనూ కబడ్డీ కూత!...5 రోజులూ జాతీయస్థాయి మజా

author img

By

Published : Jan 5, 2022, 3:49 AM IST

కబడ్డీ... కబడ్డీ... కబడ్డీ... ఈ కూతలో ఉండే కిక్కే వేరు.. ఒక్కసారిగా మనల్నీరంగంలోకి దింపేస్తుంది.! గుక్క తిప్పుకోకుండా పాయింట్లు వేటాడేయాలనిపిస్తుంది.! ఇలా వీక్షకులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే ఈ కూత. ఇవాళ్టి నుంచి తిరుపతిలోనూ వినిపించనుంది. ఐదు రోజుల పాటు జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 43 జట్లు పాల్గొననున్నాయి.

తిరుపతిలోనూ కబడ్డీ కూత
తిరుపతిలోనూ కబడ్డీ కూత

ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తిరుపతి వేదికగా జరగనున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 9 వరకూ 22 రాష్ట్రాల నుంచి వచ్చిన 700 మంది క్రీడాకారులు సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఇందిరా మైదానం వేదికగా మహిళలు, పురుషుల జట్లకు వేర్వేరుగా మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

డే & నైట్ మ్యాచ్​లు...
మొత్తం 43 జట్లను 4 గ్రూపులుగా విభజించగా లీగ్‌, నాకౌట్‌ పద్ధతిలో 175 మ్యాచ్‌లు జరపనున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంటవరకు అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకూ డేనైట్ మ్యాచ్‌లు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. తొలి 3 రోజులు లీగ్ పోటీలు, చివరి 2 రోజులు క్వార్టర్, సెమీ ఫైనల్, ఫైనల్ పోటీలు జరగనున్నాయి.

ప్రత్యేక ఏర్పాట్లు...

పురుషుల విభాగంలో తలపడనున్న జట్ల మధ్య పోటీ తొలుత 20 నిమిషాలు. మధ్యలో 5 నిమిషాల విరామం తర్వాత...మరో 20 నిమిషాల పాటు పోటీ నిర్వహిస్తారు. మహిళా విభాగంలో ముందుగా 15 నిమిషాల ఆట. మధ్యలో 5 నిమిషాల విరామం తర్వాత మరో 15 నిమిషాల పోటీ జరపనున్నారు. అంతర్జాతీయస్థాయిలో అనుభవం ఉన్న 70 మంది రిఫరీలు అందుబాటులో ఉండనున్నారు. ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

తిరుపతిలోనూ కబడ్డీ కూత

అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు...

నగరవాసులను కబడ్డీ పోటీలు అలరిస్తాయని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవ వేడుకల్లో మైదానం రంగురంగుల బాణసంచాల పేలుళ్లు మెరిశాయి. ఈత చెట్టు, నాగుపాము, సూర్య చక్రం, రన్నింగ్ వీల్... ప్రేక్షకులను కనువిందు చేశాయి. బాణసంచా పేలుళ్లకు ముందు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అబ్బురపరిచాయి.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.