ETV Bharat / city

Fake Tickets: శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లు.. నలుగురిపై కేసు నమోదు

author img

By

Published : Jan 3, 2022, 9:28 PM IST

Updated : Jan 4, 2022, 5:09 AM IST

తిరుమలలో శ్రీవారి నకిలీ దర్శన టికెట్లు
తిరుమలలో శ్రీవారి నకిలీ దర్శన టికెట్లు

21:23 January 03

తిరుమలలో వెలుగుచూసిన నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం

Fake Tickets At Tirumala: తిరుమలలో నకిలీ టిక్కెట్ల బాగోతం వెలుగుచూసింది. ఇంటి దొంగలే భారీ అక్రమార్జనకు అలవాటు పడి అక్రమాలకు పాల్పడుతూ శ్రీవారి భక్తులను మోసగిస్తున్నట్లు తితిదే విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. జనవరి 1వ తేదీన తెలంగాణకు చెందిన భక్తులకు నకిలీ టిక్కెట్లు అందించి రూ. 7 వేలు వసూలు చేయగా.. 2వ తేదీన మధ్యప్రదేశ్‌కు చెందిన యాత్రికులకు రూ. 300 విలువ చేసే మూడు నకిలీ టిక్కెట్లను ఒక్కోటి 7 వేల చొప్పున 21 వేల రూపాయలకు విక్రయించారు. నకిలీ టిక్కెట్లతో వచ్చిన భక్తులపై నిఘా ఉంచిన తితిదే విజిలెన్స్‌ అధికారులు… వైకుంఠంలో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. భక్తుల వివరణతో ఇంటి దొంగలతో పాటూ మరి కొంత మంది దళారుల బాగోతం బయటపడింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో పనిచేసే ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కృష్ణారావు నకిలీ టిక్కెట్లను తయారు చేయగా... వాటిని తనిఖీ చేయకుండా పంపేందుకు..టిక్కెట్‌ స్కానింగ్ ఆపరేటర్‌ నరేంద్ర సహకరించారు. లడ్డూ కౌంటర్‌ ఉద్యోగి అరుణ్‌రాజు, ట్రావెల్‌ ఏజెంట్‌ బాలాజీ.. భక్తులను తీసుకువచ్చే బాధ్యత తీసుకున్నట్లు విచారణలో తేలింది. నలుగురు అక్రమార్కులపై కేసు నమోదుచేశారు. ఇందులో మరి కొందరు దళారుల పాత్ర ఉన్నట్లు గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు.. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి

TIRUMALA HUNDI INCOME: శనివారం ఒక్కరోజే శ్రీనివాసుడి హుండీ ఆదాయం ఎంతంటే?

Last Updated :Jan 4, 2022, 5:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.