ETV Bharat / city

CPM News: పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి: సీపీఎం

author img

By

Published : May 19, 2022, 4:15 AM IST

Updated : May 19, 2022, 5:50 AM IST

CPM Srinivasarao On Electric Charges: పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మీటర్లు పెట్టినా.. 30 ఏళ్లపాటు ఎలాంటి ఛార్జీలు పెంచమంటున్న ముఖ్యమంత్రి​.. అదే విషయంపై చట్టం చేయాలన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
Cpm Srinivasarao On Cm Jagana

పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి: సీపీఎం

వ్యవసాయానికి మీటర్లు పెట్టినా.. 30 ఏళ్లపాటు ఎటువంటి ఛార్జీలు పెంచమంటున్న ముఖ్యమంత్రి జగన్​.. అదే విషయాన్ని చట్టం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో ఓ వైపు కరెంట్‌ కోతలు ఉంటే.. మరోవైపు వినియోగదారులపై సర్కార్​ ఛార్జీల భారం మోపుతుందని దుయ్యబట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని తిరుపతి సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డిమాండ్‌ చేశారు.

మరమగ్గాలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో భారాలు మోపడంపై ఆయన మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితం అని చెప్పిన సీఎం.. నేడు మాట మార్చి కేవలం ఎస్సీ, ఎస్టీ కాలనీలకే ఈ పథకాన్ని కొనసాగిస్తామనడం దారుణమన్నారు. భవిష్యత్‌లో నగదు లేని నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చే అమలు చేస్తారని ఎద్దేవా చేశారు.

ఇదీ చదంవడి: రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల బస్సు యాత్ర.. అక్కడినుంచే ప్రారంభం !

Last Updated :May 19, 2022, 5:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.