ETV Bharat / city

Kovvuru Cooperative Bank elections: కోఆపరేటివ్‌ బ్యాంకు ఎన్నికల్లో తెదేపా మద్దతుదారుల హవా

author img

By

Published : Jul 27, 2022, 9:11 AM IST

హోంమంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో తెదేపా మద్దతుదారులు విజయం సాధించారు. కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు పాలక మండలి ఎన్నికల్లో మొత్తం 11 స్థానాల్లోనూ తెదేపా మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హోంమంత్రి నియోజకవర్గం కావడంతో వెంటనే కొందరు ఫిర్యాదు చేయండతో అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేయండ చర్చనీయాంశమైంది.

కోఆపరేటివ్‌ బ్యాంకు ఎన్నికల్లో తెదేపా మద్దతుదారుల హవా
కోఆపరేటివ్‌ బ్యాంకు ఎన్నికల్లో తెదేపా మద్దతుదారుల హవా

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు పాలక మండలి ఎన్నికల్లో మొత్తం 11 స్థానాల్లోనూ తెదేపా మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది హోంమంత్రి తానేటి వనిత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో.. కొందరు రాజకీయాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. కొందరు అధికారులకు ఫిర్యాదు చేయడం.. వారు వెనువెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేయడం చర్చనీయాంశమైంది. ఈ బ్యాంకు పాలక మండలి ఎన్నికలు సోమవారం జరగ్గా అన్ని స్థానాల్లోనూ తెదేపా మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం అధ్యక్షుడిగా మద్దిపట్ల శివరామకృష్ణ, ఉపాధ్యక్షుడిగా దాయన రామకృష్ణను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి ఐ.వి.రమణమూర్తి ఆధ్వర్యంలో అందరూ సంతకాలు చేశారు. ఇదే సమయంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారంటూ కొందరు వైకాపా నాయకులు జిల్లా సహకార అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా సహకార అధికారి ఎంవీవీ నాగభూషణం మంగళవారం కొవ్వూరు వచ్చారు. కొవ్వూరు డీఎల్‌సీవో (ఎఫ్‌ఏసీ) కె.సుబ్బారావు ఎన్నికల నిర్వహణ విధానంపై దస్త్రాలను తనిఖీ చేశారు. బుధవారం తనిఖీలు కొనసాగవచ్చని సమాచారం. ఈ బ్యాంకులో కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని 3వేల మంది సభ్యులుగా ఉన్నారు. 1983 నుంచి ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనూ తెదేపా తరఫున పాలకవర్గం ఎన్నికవుతోంది. సొసైటీలను నిర్వీర్యం చేసేలా వైకాపా ప్రభుత్వం కమిటీలు వేస్తోందని కొవ్వూరు నియోజకవర్గ తెదేపా ద్విసభ్య కమిటీ సభ్యులు విమర్శించారు. సొసైటీలకు ఎన్నికలు పెడితే అన్నిచోట్లా తెదేపా విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.

వైకాపా గ్రూపు రాజకీయాలతో తెదేపా హవా: వైకాపా కౌన్సిలర్‌
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ వ్యాప్తంగా వైకాపాలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని, తమ పార్టీ అధికారంలో ఉన్నా తెదేపా హవా కొనసాగుతోందని 22వ వార్డు కౌన్సిలర్‌ (వైకాపా), యువజన విభాగ అధ్యక్షుడు కంఠమణి రమేష్‌ పేర్కొన్నారు. కొవ్వూరు ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీరామా సొసైటీ (పీఏసీఎస్‌) పర్సన్‌ ఇన్‌ఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నానని, ఆ పత్రాలను సహకార అధికారులకు అందించానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: CM Jagan: 15 రోజుల్లో వరద నష్టం గణన పూర్తి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.