ETV Bharat / city

నిన్న గోవా.. నేడు పాండిచ్చేరి.. నెల్లూరులో ఇతర రాష్ట్రాల మద్యం!

author img

By

Published : Mar 30, 2022, 5:39 PM IST

Liquor seized: నెల్లూరులో మరోసారి మద్యం అక్రమ రవాణా కలకలం సృష్టించింది. మంగళవారం గోవాకు చెందిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇవాళ పాండిచ్చేరి రాష్టానికి చెందిన 843 మద్యం, 121 బీరు బాటిళ్లను సీజ్​ చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

Liquor seized in Nellore
నెల్లూరులో ఇతర రాష్ట్రాల మద్యం

Liquor seized: నెల్లూరులో నిన్న గోవా రాష్ట్రానికి చెందిన మద్యం పట్టుబడితే ఈరోజు పాండిచ్చేరి మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాన మద్యాన్ని తెస్తున్న అక్రమార్కులు.. ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తూ సోమ్ము చేసుకుంటున్నారు. సుబేదారుపేట వద్ద ఓ ఇంట్లో సెబ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడ నిల్వ ఉంచిన 843 మద్యం, 121 బీరు బాటిళ్లను అధికారులు సీజ్​ చేశారు. ప్రవీణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

నెల్లూరులో ఇతర రాష్ట్రాల మద్యం

Liquor seized: నిందితుడు ప్రవీణ్ పాండిచ్చేరి నుంచి ఖరీదైన మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి అవసరమైనవారికి రహస్యంగా చేరవేస్తున్నట్లు సెబ్ అదనపు సుపరింటెండెంట్ క్రిష్ణ కిషోర్ తెలిపారు. నిందితునిపై గతంలోనూ అక్రమ మద్యం కేసు ఉందని చెప్పారు. సీజ్​ చేసిన మద్యం విలువ రూ.2 లక్షలపైనే ఉంటుందని, మద్యంతోపాటూ బైకును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: Medicines: విజయవాడ రైల్వే ఆసుపత్రి ఔషధాల కొనుగోళ్లలో గోల్‌మాల్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.