ETV Bharat / city

ఆమే ప్రతిభకు అవేమీ అడ్డురాలేదు... డెఫ్​ ఒలంపిక్స్​లో కాంస్యం

author img

By

Published : Jun 15, 2022, 10:51 PM IST

సాధారణ కుటుంబంలో పుట్టింది ఆ యువతి... కానీ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తోంది. టాలెంట్‌కు ఏవి అడ్డురావని నిరూపిస్తోంది. తండ్రి పోత్సహంతో క్రీడల్లో రాణిస్తూ అందరీ మన్ననలు అందుకుంటోంది. ప్రతిష్ఠాత్మక డెఫ్ ఒలింపిక్స్ వేదికపై... అద్భుత ఆటతో... పతకం సాధించి... ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడి శభాష్ అనిపించుకున్న కర్నూలుకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ జాఫ్రిన్‌.

jafrin
జాఫ్రిన్‌

ఇక్కడ టెన్నిస్ ఆడుతున్న ఈ యువతిని చూశారా.....చాలా బాగా ఆడుతోంది కదూ..! తను ఒక డెఫ్‌ పర్సన్‌.. చెవులు వినపడవు, మాటలు సరిగ్గా రావు. ఐనా ఏ రోజు కుంగి పోలేదు. చిన్నప్పటి నుంచి తండ్రి సహకారంతో ఆటల్లో రాణిస్తోంది. అలా టెన్నిస్‌ క్రీడాలో చక్కటి ప్రతిభ కనబరుస్తూ అందరితో ప్రశంసలు అందుకుంది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తనకంటూ కొన్ని రికార్డులను నెలకొల్పింది.

కర్నూలు జిల్లాకు చెందిన ఈ యువతి పేరు షేక్‌ జాప్రిన్‌. ఈ అమ్మాయికి మూడేళ్ల వయసులోనే చెవులు వినపడవు, మాటలు రావని తల్లిదండ్రులు గుర్తించారు. జాఫ్రిన్‌ తండ్రి కుమార్తెలోని లోపాలను మరిచిపోయేలా తనను పాఠశాలకు పంపడం మెుదలుపెట్టాడు. చిన్నతనంలో స్పోర్ట్స్‌పై తన ఆసక్తిని గమనించిన తండ్రి తనకు టెన్నిస్‌ అంటే ఇష్టమని తెలుసుకున్నాడు. అలా ఎనిమిదేళ్ల ప్రాయంలోనే టెన్నిస్‌ నేర్పించడం ప్రారంభించాడు.

జాఫ్రిన్‌

పసిప్రాయం నుంచే విశేష ప్రతిభ చూపుతుండటంతో... టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా దృష్టిని జాఫ్రిన్‌ ఆకర్షించింది. నాలుగేళ్లపాటు ఉచితంగా హైదరాబాద్‌లోని సానియామీర్జా టెన్నిస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం బెంగళూరులో శిక్షణ పొందుతోంది.

బ్రెజిల్‌ వేదికగా ఈ ఏడాది మే నెలలో డెఫ్ ఒలింపిక్స్‌ 2021 పోటీలు జరిగాయి. ఎన్నడూ లేని విధంగా భారత్‌ 16 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది. టెన్నిస్ విభాగంలో సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీ పడిన జాఫ్రిన్. సింగిల్స్, డబుల్స్‌లో నిరాశపరిచింది. అయినప్పటికీ మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో జాఫ్రీన్‌–పృథ్వీ శేఖర్‌ జోడి. భారత్‌కే చెందిన మరో టీంను ఓడించి కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.

"జాఫ్రిన్​కు చాలా అవకాశాలు వచ్చాయి. ఇండియన్​ గ్రాండ్​స్లమ్​ సానియా మిర్జా కూడా జాఫ్రిన్​కు నాలుగేళ్లు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు పీబీఐ సెంటర్​ ఆఫ్​ స్పోర్ట్స్​ ఎక్సలెన్సీ బెంగళూరులో శిక్షణ ఇప్పిస్తున్నాం. రీతు గోగై, సెజర్​ అనే ఇద్దరు కోచ్​లు జాఫ్రిన్​కు మంచి శిక్షణ ఇస్తున్నారు. దానివల్లే ఈ డెఫ్​ ఒలంపిక్స్​లో కాంస్య పతకం వచ్చింది. ఇక్కడితో ఆగిపోము. 2025లో పారిస్​లో జరిగే డెఫ్​ ఒలంపిక్స్​లో బంగారు పతకం సాధించేలా తీసుకొస్తుందని ఆశిస్తున్నాను."-జాఫ్రిన్ తండ్రి

మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ప్రతిభ కనబరిచిన షేక్ జాఫ్రిన్‌కు ప్రధానితో మాట్లాడే అరుదైన అవకాశం లభించింది. ఆయన నివాసంలో క్రీడాకారులతో జరిగిన ముఖాముఖిలో పాల్గొని మోదీ ప్రశంసలు పొందింది జాఫ్రిన్‌. అలాగే రెండు నెలల క్రితం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ నుంచి బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ డీజేబీలీటీ అవార్డును అందుకుంది. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌ జాఫ్రిన్‌ ఘనంగా సన్మానించారు.

తన ప్రతిభకు కారణం తన తండ్రే అంటోంది జాఫ్రిన్‌. చిన్నప్పటి నుంచి తన వెన్నంటి ఉండి తనను ప్రోత్సహించాడని చెబుతోంది ఈ యువతి. 17 ఏళ్ల నుంచి తనను ఎప్పుడు నిరాశపరచకుండా ఆటల్లో సహాయం చేస్తూ... నేను ఈ స్థాయికి రావడానికి తన తండ్రి ఎంతో కృషి చేశాడని జాఫ్రిన్‌ అంటోంది.

2022మలేషియలో జరిగే ఏషియన్ గేమ్స్, 2023 వరల్డ్ ఛాంపియన్ పోటీలు, 2025 ప్యారిస్ డెఫ్ ఒలింపిక్స్‌లో పతకాలు గెలవడమే లక్ష్యమని చెబుతోంది జాఫ్రిన్‌. రాబోయే రోజుల్లో డెఫ్‌ క్రీడాకారులకు మరింతగా సాయం చేసి పతకాలు గెలిచేలా చూడాలని అంటోంది ఈ యువతి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.