ETV Bharat / city

Murder: పిఠాపురంలో దారుణం... అత్తను నరికి చంపిన అల్లుడు

author img

By

Published : May 18, 2022, 10:44 AM IST

Murder: పిఠాపురంలోని విద్యుత్ నగర్‌లో దారుణం జరిగింది. అత్తను అల్లుడు కత్తితో నరికి హత్య చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన మామ, బావమరిదిపైనా దాడి చేశాడు.

Murder
అత్తను హత్య చేసిన అల్లుడు

Murder: కాకినాడ జిల్లా పిఠాపురంలోని విద్యుత్ నగర్‌లో సొంత అల్లుడి చేతిలో మహిళ దారుణ హత్యకు గురైంది. గండేపల్లి రమణమ్మ(46) అనే మహిళను అల్లుడు రమేష్​ కత్తితో నరికి హతమార్చాడు. అడ్డువచ్చిన మామ సత్యనారాయణ, బావమరిది దిలీప్​పైన కూడా కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలు కావడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.