ETV Bharat / city

Loan App: ఇక రుణ యాప్​ల ఆట కట్టు.. కేంద్రం ఆదేశాలతో పోలీసుల వేట మొదలు..

author img

By

Published : Oct 5, 2022, 8:48 AM IST

Updated : Oct 5, 2022, 11:07 AM IST

Loan app scams in AP
రుణ యాప్​ల ఆట కట్టు

Loan app scams in AP లోన్ యాప్ నిర్వాహకుల మోసాలకు, వేధింపులకు జనం బలవుతున్న నేపథ్యంలోకేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. లోన్ యాప్‌లను కట్టడి చేయాలని రాష్ట్రాలను ఆదేశించడంతో.. రాష్ట్ర పోలీసులు కూడా ఇప్పుడు బాధితుల ఫిర్యాదులపై దృష్టి సారిస్తున్నారు. కడప పోలీసులకు అందిన ఫిర్యాదు ఆధారంగా చెన్నై, రాజస్థాన్ కు చెందిన ముఠా నిర్వహిస్తున్న కాల్ సెంటర్ ముఠా గుట్టును వై.ఎస్.ఆర్.జిల్లా పోలీసులు రట్టు చేశారు. తెలంగాణకు చెందిన ఆరుగురు లోన్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేసి, ప్రధాన నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు.

Police took action on loan app: ఎలాంటి పత్రాలు అవసరం లేకుండానే సులభంగా రుణాలు దొరుకుతుండటంతో జనం లోన్‌ యాప్‌ల పట్ల ఆకర్షితులవుతున్నారు. రుణం సులభంగానే దొరికినా ఆ తర్వాత చెల్లింపుల విషయంలో ఎదురవుతున్న బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరగడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. లోన్ యాప్ మోసాలను అరికట్టడాలని రాష్ట్రాలకు ఆదేశించింది. దీంతో రాష్ట్ర పోలీసుశాఖ లోన్ యాప్ కేసులను దుమ్ముదులిపి బయటికి తీస్తోంది.

కేంద్రం ఆదేశాలతో రుణ యాప్​ల ఆట కట్టు

ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన వై.ఎస్.ఆర్.జిల్లా చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ లో బండి సాయికుమార్ రెడ్డి అనే లోన్ యాప్ బాధితుడు ఫిర్యాదు చేయగా.. ఆ కేసును ఆరునెలల తర్వాత పోలీసులు చేధించారు. ఓ సిమెంటు కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న సాయికుమార్ రెడ్డి.. జనవరిలో "రుపీస్ క్యాష్, రుపీస్ లోన్" యాప్ ల ద్వారా 95 వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. బాధితుడు అనేక విడతల్లో3 లక్షల 71 వేల రూపాయలు చెల్లించినా.. ఇంకా 99 వేలు బకాయి ఉన్నావంటూ నిర్వాహకులు ఫోన్లు చేసి బెదిరించారు. దీంతో బాధితుడు ఈ ఏడాది ఏప్రిల్ 19న సీకేదిన్నె పోలీసులకు ఫిర్యాదు చేశాడు

బాధితుడి యూపీఐ నంబర్లు, నిందితుల బ్యాంకు ఖాతా నంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటీవలే రంగనాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తే.. అసలు దొంగల జాడ తెలిసింది. హైదరాబాద్ మాదాపూర్ కేంద్రంగా లోన్ యాప్ మోసాలు సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఇటెడన్ సొల్యూషన్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో 20 మంది వ్యక్తులతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీలో మేనేజర్లు, డైరెక్టర్లుగా పనిచేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు బ్యాంకు 10 శాతం కమీషన్‌గా తీసుకుని బాధితుల డబ్బును ప్రధాన సూత్రధారులు చెన్నైకి చెందిన అన్బు, రాజస్థాన్ కు చెందిన జాన్ యాదవ్ ఖాతాలను మళ్లించే వారని పోలీసు విచారణలో తేలింది.

ఈ కాల్ సెంటర్ల ఖాతాల నుంచి ఇప్పటివరకు 5 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మాదాపూర్ లోని కాల్ సెంటర్ ను సీజ్ చేసి..దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితులను బ్లాక్ మెయిల్ చేసి ఎన్ని కోట్ల రూపాయలు కాజేశారు.. ఇందులో ఎవరెవరి హస్తం ముందనే దానిపై పూర్తి స్థాయి విచారణ సాగుతోందని ఎస్పీ వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా వచ్చే లోన్ యాప్ ల ద్వారా రుణాలు తీసుకోవద్దని.. సెల్ ఫోన్‌ సందేశాల్లోని లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 5, 2022, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.