ETV Bharat / city

మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కుమారుడు, అనుచరులపై కేసు నమోదు

author img

By

Published : Oct 7, 2020, 9:10 AM IST

హైదరాబాద్ బంజారాహిల్స్​ పీఎస్​లో మాజీ ఎమ్మెల్యే కుమారుడు, అనుచరులపై కేసు నమోదైంది. స్థల విషయంలో బెదిరించారని వ్యాపారి శివగణేశ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

a-case-has-been-registered-at-the-banjara-hills-police-station-against-the-son-and-followers-of-former-mla-varadaraju
మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కుమారుడు, అనుచరులపై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు, అనుచరులపై కేసు నమోదు అయింది. హైదరాబాద్​ బంజారాహిల్స్ పీఎస్‌లో కొండారెడ్డి, మరో 15మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థల విషయంలో తనను బెదిరించారని వ్యాపారి శివగణేశ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రొద్దుటూరులోని 2.5 ఎకరాల స్థలం వివాదంపై వ్యాపారి శివగణేశ్‌ హైదరాబాద్ బంజరాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన శివగణేష్‌... శ్రీనగర్‌కాలనీలో నివాసముంటున్నారు.

ఇదీ చదవండిః 'స్వదేశీ వ్యాక్సిన్ ఫలితాలు ఆశాజనకం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.