ETV Bharat / city

'ఆన్ లైన్ రుణ యాప్​లతో అప్రమత్తం తప్పనిసరి'

author img

By

Published : Jan 3, 2021, 12:11 PM IST

police conduct awareness seminars
గుంటూరు జిల్లా పోలీసుల అవగాహన సదస్సు

ఆన్ లైన్ రుణ యాప్​లతో మోసపోతున్న ప్రజలకు గుంటూరు జిల్లా పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రయాణాల సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరగకుండా కాపాడే లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం ఆవశ్యకతను తెలియజేశారు.

ఆన్ లైన్ రుణ యాప్​లతో ప్రజలు మోసపోతున్న నేపథ్యంలో వారికి అవగాహన కల్పించేలా గుంటూరు అర్బన్ పరిధిలో పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహించారు. నగరంపాలెంలోని రుషి వ్యాలీ అపార్టుమెంటులో కంట్రోల్ రూమ్ పోలీసులు.. సదస్సు నిర్వహించారు. యాప్​ల వలలో చిక్కుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రయాణాల సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరగకుండా కాపాడే లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టం ఆవశ్యకతను పోలీసులు వివరించారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు.

ఇదీ చదవండి:

గుంటూరులో ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.