ETV Bharat / city

హెచ్​పీ గ్యాస్ వినియోగదారులకు బంఫర్ ఆఫర్.. ఆ సినిమా టిక్కెట్లు ఫ్రీ..!

author img

By

Published : Mar 18, 2022, 9:01 PM IST

HP Gas Bumper Offer: మీరు హెచ్​పీ గ్యాస్ వినియోగదారులా? మీకు ఒకటే సిలిండర్​ ఉందా..? అయితే గుంటూరు జిల్లా దుగ్గిరాల శాఖ మీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ప్రకటించారు. మరో సిలిండర్ తీసుకోవడానికి ఈ చక్కటి అవకాశాన్ని కల్పించారు. సిలెండర్​ తీసుకుంటే మీకు ఇంకో ఆఫర్​ కూడా ఉంది.. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయిచే ఇది చదివేయండి.

Bumper offer for HP Gas customers
Bumper offer for HP Gas customers

HP Gas Bumper Offer: హెచ్​పీ గ్యాస్ వినియోగదారులకు గుంటూరు జిల్లా దుగ్గిరాల శాఖ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. సింగిల్ సిలిండర్ కలిగిన వినియోగదారులు మరో సిలిండర్ తీసుకోవడానికి ఈ చక్కటి అవకాశాన్ని కల్పించారు. అవకాశంతో పాటు వినియోగదారులను ఆకర్షించే విధంగా చక్కటి ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు. దుగ్గిరాలలో గల ఇన్సాస్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ శ్రీనివాసరావు వినూత్నంగా ఆలోచించి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి టికెట్లు ఉచితంగా ఇస్తామంటూ బంపర్ ఆఫర్​ను ప్రకటించి.. తమ ఏజెన్సీ ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దాన్ని చూసిన వినియోగదారులు ఇప్పటికే మూడు సిలిండర్లు బుక్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. గతంలో కూడా ప్రేక్షకుల ఆదరణ కలిగిన బాహుబలి-2 చిత్రానికి కూడా ఇదే రీతిలో ఉచితంగా టికెట్లను పంపిణీ చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ టికెట్లు కూడా సినిమా విడుదల రోజున రెండో సిలిండర్ కొనుగోలు చేసిన వినియోగదారుడి ఇంటికి వెళ్లి ఇవ్వనున్నట్లు తెలిపారు.

హెచ్.పీ గ్యాస్ వినియోగదారులకు బంఫర్ ఆఫర్...మరో సిలిండర్ తీసుకుంటే ఆ సినిమా టిక్కెట్లు ఫ్రీ...

ఇదీ చదవండి : Tenth Class Exams : మారిన పది పరీక్షల షెడ్యూల్...ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకూ ఎగ్జామ్స్...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.