ETV Bharat / city

auto driver attack on women: మహిళపై ఆటోడ్రైవర్‌ దాష్టీకం.. అప్పు డబ్బులు అడిగితే కాలితో తన్నాడు

author img

By

Published : Aug 6, 2021, 2:08 PM IST

Updated : Aug 6, 2021, 2:31 PM IST

ఇచ్చిన డబ్బు అడగడమే ఆమె చేసిన నేరమైంది. బాకీ అడిగినందుకు ఓ డ్రైవర్ విచక్షణ కోల్పోయాడు. మహిళ అని కూడా చూడకుండా కాలితో ఎగిరి తన్నాడు. సీఎం నివాస ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా.. పోలీసులు నిందుతుడ్ని అదుపు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

auto driver attack on women at tadepalli
auto driver attack on women at tadepalli

బాకీ అడిగినందుకు కాలితో తన్నాడు

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ మహిళపై ఆటోడ్రైవర్‌ దాడికి పాల్పడ్డాడు. ఇచ్చిన అప్పు తీర్చమని అడిగిన మహిళను కాలితో తన్నాడు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. బాధితురాలు ప్రస్తుతం మంగళగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన గోపీకృష్ణ అనే యువకుడికి గోవర్ధని అనే మహిళ గతంలో వడ్డీకి రూ.3లక్షలు అప్పు ఇప్పించింది. అప్పు తీర్చమని అడుగుతుంటే గోపి పట్టించుకోలేదు. దీంతో గోపి స్వగ్రామం చిర్రావూరు వెళ్లి బాకీ తీర్చాలని అడిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గోపి.. గోవర్ధనిని కాలితో బలంగా తన్నాడు. దీంతో ఆమె కుప్పకూలింది. అక్కడికి కాసేపటికి 100 నంబరుకు గోవర్ధని ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మంగళగిరి రూరల్‌ పోలీసులు గోపీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: పకడ్బందీగా దిశ చట్టం అమలుకు సీఎం ఆదేశం

Last Updated :Aug 6, 2021, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.