ETV Bharat / city

AP TOP NEWS : ప్రధాన వార్తలు @ 5PM

author img

By

Published : Jan 19, 2022, 5:00 PM IST

ప్రధాన వార్తలు @ 5PM
ప్రధాన వార్తలు @ 5PM

.

  • AP POLICE : 'విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌ తల్లిదండ్రులకు ఏపీ పోలీసుల నోటీసులు'

విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌ తల్లిదండ్రులకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పీవీ.రమేశ్ తల్లిదండ్రులు ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • RGV Tweet: గుడివాడలో క్యాసినో.. కొడాలి నానిని మెచ్చుకోవాలి: రాంగోపాల్‌ వర్మ

RGV Tweet on minister Kodali Nani: గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లో జూదం నిర్వహించారన్న వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. గుడివాడ ఆధునికీకరణకు పాటు పడుతున్న నానికి తన పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఆర్జీవీ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • MP RAGHURAMARAJU: 'ఉద్యోగుల న్యాయబద్దమైన డిమాండ్లను ప్రభుత్వం నేరవేర్చాలి'

MP RAGHURAMARAJU: పీఆర్‌సీపై ఉద్యోగుల ఆందోళనలకు మద్దతుగా....వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దీక్ష చేపట్టారు. దిల్లీలోని నివాసంలో ఉపవాస దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఎంపీ రఘురామ ఉపవాస దీక్ష కొనసాగనుంది. ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఎంపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ప్రగతిభవన్ వద్దకు వచ్చిన మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని ప్రగతిభవన్ వద్దకు వచ్చిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా అనుమతించబోమని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఆదివారం పీక్​ స్టేజ్​కు కరోనా థర్డ్ వేవ్.. ఎన్ని కేసులు వస్తాయంటే...'

India Corona Third wave: భారత్​లో కరోనా మూడో వేవ్.. జనవరి 23న గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు ఐఐటీ కాన్పుర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్. రోజువారీ కేసుల సంఖ్య ఆదివారం 4 లక్షల వరకు ఉండొచ్చని.. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అభివృద్ధే మా మంత్రం.. ఉత్తరాఖండ్​లో గెలుపు తథ్యం'

Uttarakhand CM on Elections: దేవభూమి ఉత్తరాఖండ్‌ ఐదో దఫా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోవడం.. ప్రతిపక్షం అధికారంలోకి రావడం ఇక్కడ ఆనవాయితీ. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • విమానాలకు '5జీ' బ్రేకులు.. భారతీయుల తీవ్ర ఇబ్బందులు

US flights cancel over 5G: 5జీ సిగ్నళ్లు విమాన సేవలకు ఇబ్బంది కలిగిస్తాయన్న ఆందోళనలతో.. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • చమురు మంటకు తోడు కొవిడ్ దెబ్బ- సెన్సెక్స్ 656 డౌన్

Stock market news: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల వరుసగా రెండో రోజూ భారీ నష్టాలను చవిచూశాయి స్టాక్​ మార్కెట్లు. సెన్సెక్స్​ 656 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 175 పాయింట్లు పతనమైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ICC Test Rankings: కోహ్లీ కాస్త పైకి.. పంత్, బుమ్రా దూకుడు

ICC Test Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. పంత్, బుమ్రా కూడా తమ ర్యాంకుల్లో ముందుకు జరిగారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మన సినిమాల క్రేజ్.. హిందీలో 'రంగస్థలం'తో పాటు మరిన్ని

బాలీవుడ్​ ఆడియెన్స్ దక్షిణాది సినిమాలంటే పడిచచ్చిపోతారు! యూట్యూబ్​లో మన డబ్బింగ్ సినిమాల వ్యూస్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అలానే ఈ మధ్య 'పుష్ప'తో బన్నీ బంపర్ హిట్ కొట్టారు. దీంతో దక్షిణాదికి చెందిన పలు సినిమాలను నేరుగా ఉత్తరాది థియేటర్లలో రిలీజ్​కు ప్లాన్ రెడీ అవుతుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.