ETV Bharat / city

తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన తొమ్మిదేళ్ల చిన్నారి

author img

By

Published : May 6, 2020, 11:56 PM IST

లాక్​డౌన్.... ఆ పిల్లలకు తండ్రిని దూరం చేసింది. ఆడుతూ, పాడుతూ ఉండాల్సిన చిన్నారితో తండ్రికి అంత్యక్రియలు చేయించింది. ఈ హృదయ విదారక ఘటన గుంటూరులో జరిగింది.

a girl conduct funeral rites to her father in guntur
a girl conduct funeral rites to her father in guntur

a girl conduct funeral rites to her father in guntur
రాజ్​కుమార్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు

ఓ కుటుంబంపై లాక్​డౌన్ తీవ్ర ప్రభావం చూపింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు తట్టుకోలేక తండ్రి మరణిస్తే... తొమ్మిదేళ్ల బాలిక అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. గుంటూరు నగరంలోని వెంకటప్పయ్య కాలనీకి చెందిన రాజ్​కుమార్... మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించకునే అతను... లాక్​డౌన్ కారణంగా గత 40 రోజులుగా ఇంటి వద్ద ఉండాల్సి వచ్చింది.

ఉపాధి లేకపోవటంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీనికి తోడు ఇంట్లో చిన్న గొడవలకు మనస్థాపానికి గురైన రాజ్​​కుమార్... ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుమార్తె భవానికి 9 సంవత్సరాలు కాగా .. చిన్న కుమార్తె మానసకు ఏడేళ్లు. కుమారులు లేకపోవటంతో తండ్రికి భవానీ అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. ఆ చిన్నారికి వచ్చిన కష్టం... స్థానికులతో కన్నీరు పెట్టించింది.

ఇదీ చదవండి

నరసరావుపేటలో ఏం జరుగుతోంది... మిషన్- 15‌ అంటే ఏమిటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.