ETV Bharat / city

venkaiah naidu:పాత, కొత్త తరానికి వారధి ఆయన రచనలు

author img

By

Published : Jul 29, 2021, 4:10 PM IST

సాహితీ ప్రపంచంలో ఆయన స్థానం ప్రత్యేకమైందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. నేను ఎక్కువగా అభిమానించే తెలుగు కవుల్లో సినారె తొలి వరుసలో ఉంటారని ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు. జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సినారెకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు.

వెంకయ్యనాయుడు
venkaiah naidu

నేను అభిమానించే తెలుగు కవుల్లో సినారె ముందు వరుసలో ఉంటారని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణరెడ్డి 90వ జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. సాహితీ ప్రపంచంలో ఆయన స్థానం ప్రత్యేకమైందని వెంకయ్యనాయుడు కొనియాడారు.

రాజసం, ఠీవీ, గాంభీర్యం, లాలిత్యం, మాధుర్యం, శృంగారాల మేళవింపుగా సాగిన వారి రచనలు పాత తరానికి, కొత్త తరానికి వారధిగా నిలిచాయని ప్రశంసించారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారన్న ఆయన.. సినిమా సాహిత్యానికి సైతం గౌరవాన్ని సంపాదించిపెట్టిన సినారె గారిని తెలుగుజాతి తరతరాలు గుర్తు పెట్టుకుంటుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

  • ప్రముఖకవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత శ్రీ సింగిరెడ్డి నారాయరెడ్డి (సినారె) గారి 90వ జయంతి సందర్భంగా ఆ సాహితీమూర్తి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. సాహితీ ప్రపంచంలో వారి స్థానం ప్రత్యేకమైనది. నేను అత్యంత అభిమానించే తెలుగు కవుల్లో సినారె తొలి వరుసలో ఉంటారు. pic.twitter.com/T30xcOIfW0

    — Vice President of India (@VPSecretariat) July 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:

VENKAIAH NAIDU: 'రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడం దేశానికే గర్వకారణం'

పార్లమెంటులో మళ్లీ అదే సీన్- వెంకయ్య ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.