ETV Bharat / city

TS: ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు విస్మయం.. ఆ మొత్తం చెల్లించాలని స్మితా సబర్వాల్​కు ఆదేశం

author img

By

Published : May 3, 2022, 4:46 AM IST

ts high court  on smitha sabarwal
ts high court on smitha sabarwal

smita sabharwal defamation case: పరువునష్టం కేసు వేసేందుకు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు తెలంగాణ ప్రభుత్వం నిధులివ్వడంపై ఆ రాష్ట్ర హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమన్న కోర్టు.. ప్రభుత్వం చెల్లించిన రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని స్మితాసబర్వాల్​ను ఆదేశించింది.

smita sabharwal defamation case: పరువునష్టం కేసు వేసేందుకు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు తెలంగాణ ప్రభుత్వం నిధులివ్వడంపై ఆ రాష్ట్ర హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయం అసమంజసం, ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొంది. ప్రభుత్వం చెల్లించిన రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని స్మితాసబర్వాల్​ను హైకోర్టు ఆదేశించింది. 2015లో అవుట్‌ లుక్‌ మ్యాగజైన్‌పై స్మితాసబర్వాల్‌ పరువునష్టం దావా వేసింది. తన ఫోటోను అవమానకరంగా ప్రచురించారని పరువునష్టం కేసు దాఖలు చేశారు.

అయితే కోర్టు ఫీజుల కోసం స్మితా సబర్వాల్​కు రూ.15లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై అవుట్‌లుక్, మరో ఇద్దరు హైకోర్టులో వ్యాజ్యంపై దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు రూ.15 లక్షలు తిరిగి చెల్లించాలని స్మితాసబర్వాల్​ను ఆదేశించింది. 90 రోజుల్లో చెల్లించకపోతే స్మితాసబర్వాల్ నుంచి వసూలు చేయాలని ఆదేశాలిచ్చింది. ఫ్యాషన్ షో స్మితా సబర్వాల్ అధికార విధులు కావని హైకోర్టు తెలిపింది. ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ సంస్థపై కేసు వేస్తే ప్రజా ప్రయోజనం ఎలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు సహేతుకంగా లేకుంటే కోర్టులు సమీక్షించవచ్చని స్పష్టం చేసింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.