ETV Bharat / city

TRANSCO: విద్యుత్​ డిమాండ్ మేరకు డిస్కంలు పని చేస్తున్నాయి: ట్రాన్స్‌కో

author img

By

Published : Oct 13, 2021, 7:00 PM IST

Updated : Oct 13, 2021, 7:50 PM IST

TRANSCO
ఏపీట్రాన్స్‌కో

18:55 October 13

అతి తక్కువ అంతరాయంతోనే విద్యుత్​ సరఫరా

 రాష్ట్రంలో బొగ్గు కొరత(coal shortage) ఉన్నప్పటికీ విద్యుత్ డిమాండ్​ మేరకు డిస్కంలు పని చేస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అతి తక్కువ అంతరాయంతోనే విద్యుత్​ను సరఫరా చేయగలుగుతున్నట్టు ఏపీ ట్రాన్స్​కో వెల్లడించింది. బొగ్గు కొరతతోపాటు విద్యుత్ డిమాండ్ పెరగడం వల్లే ఇబ్బందులు తలెత్తినట్టు ట్రాన్స్​కో(transco reaction on power shortage in Andhra pradesh ) పేర్కొంది. ఏపీజెన్​కో వ్యవస్థాపిత సామర్థ్యం 5010 మెగావాట్లు అయినప్పటికీ బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో 2500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందని వెల్లడించింది. దేశంలో నెలకొన్న బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం(power shortage in Andhra pradesh) తలెత్తిందని ట్రాన్స్​కో పేర్కొంది. నిరంతరాయ సరఫరా కోసం పీక్ డిమాండ్ ఉన్న సమయంలో ఒక్కో యూనిట్​కు 15-20 రూపాయల వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చిందని తెలిపింది.

పీక్ డిమాండ్ మేరకు 9064 మెగావాట్ల విద్యుత్ అవసరం..  

బొగ్గు కొరత కారణంగా తక్కువ స్థాయిలో విద్యుత్ అంతరాయాలతో(power shortage in ap) సరఫరాను చేయగలుగుతున్నామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 18,533 మెగావాట్లు అయినప్పటికీ సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావడం లేదని పేర్కొంది. ఇందులో 8075 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఉన్నా.. బేస్ లోడుకు సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావడం లేదని తెలిపింది. 908 గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి వస్తున్న విద్యుత్ కేవలం 100 మెగావాట్లు మాత్రమేనని ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. పీక్ డిమాండ్ మేరకు 9064 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోందని ట్రాన్స్​కో వెల్లడించింది.

ఎన్టీపీఎస్​లోనూ...

బొగ్గు కొరత కారణంగా వీటీపీఎస్​తోపాటు రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్​లోని యూనిట్లను నిలిపివేయాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. అలాగే కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్​తోపాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీపీఎస్ కూడా సామర్థ్యం కంటే తక్కువ విద్యుత్​నే ఉత్పత్తి చేస్తున్నాయని ట్రాన్స్​కో పేర్కొంది.  ప్రస్తుతం ప్రభుత్వ అభ్యర్థనతో సరఫరా 40 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందని ప్రభుత్వం(power shortage in Andhra pradesh) తెలిపింది.

ఇదీ చదవండి.. 

దేశంలో ముంచుకొస్తున్న విద్యుత్​ సంక్షోభం

Last Updated :Oct 13, 2021, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.