ETV Bharat / city

తెలంగాణ: హైదరాబాద్​లో రాష్ట్ర సచివాలయ కూల్చివేత.. ట్రాఫిక్ ఆంక్షలు

author img

By

Published : Jul 7, 2020, 9:33 PM IST

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో రాష్ట్ర సచివాలయ కూల్చివేత నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫలితంగా వాహనదారులు ప్రత్యాహ్నయ మార్గాలను ఎంచుకుంటున్నారు.

Traffic restrictions on demolition of State Secretariat in Hyderabad
తెలంగాణ: హైదరాబాద్ లో రాష్ట్ర సచివాలయ కూల్చివేతతో ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ: హైదరాబాద్ లో రాష్ట్ర సచివాలయ కూల్చివేతతో ట్రాఫిక్ ఆంక్షలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో రాష్ట్ర సచివాలయ కూల్చివేత సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కొన్ని రహదారులను మూసేశారు. దీని వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయం వైపు వెళ్లే మార్గాలన్నింటికీ ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఉదయాన్నే విధులకు వెళ్లేవారు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు అందరికీ ఈ ఆకస్మిక ఆంక్షలు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయి.

  • ఆంక్షలు ఎప్పుడు సడలిస్తారో చెప్పలేదు..

ఈ ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగించనున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేయలేదు. ఫలితంగా వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రధానంగా సచివాలయం నుంచి సికింద్రాబాద్, హిమాయత్​నగర్, సైఫాబాద్​, ఖైరతాబాద్, లక్ఢీకాపూల్ తదితర మార్గాల్లో వెళ్లేందుకు ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.

ఇవీ చూడండి : మా పార్టీలోనూ వెన్నుపోటుదారులు ఉన్నారు: అంబటి రాంబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.