ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM

author img

By

Published : Jul 24, 2022, 2:58 PM IST

.

TOP NEWS
ప్రధాన వార్తలు

  • విలీన గ్రామాల ప్రజలు నమ్మకం కోల్పోయారు: చంద్రబాబు
    Chandrababu: రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడం వల్లనే తెలంగాణలో కలపాలని విలీన గ్రామాల ప్రజల డిమాండ్ చేస్తున్నారని.. తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 14 రోజులుగా కరెంట్, నీరు లేక వరద బాధిత ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Rowdysheeter:నన్ను ఎదిరిస్తే ఎవరికైనా ఇదేగతి.. రౌడీషీటర్ బహిరంగ హెచ్చరిక
    Gowri Shankar: ‘నన్ను ఎదిరిస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది’ ... ‘తన వద్ద తీసుకున్న రూ.500 తిరిగి ఇవ్వమని అడిగినందుకు అనుచరులతో కలిసి వచ్చి అప్పన్న(28)ను నరికి చంపిన తర్వాత శుక్రవారం అర్ధరాత్రి రౌడీషీటర్‌ గౌరీశంకర్‌ కత్తి తిప్పుతూ సంఘటన స్థలంలో చేసిన హెచ్చరిక ఇది’ అని పలువురు పేర్కొంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • చెత్త పన్ను పెంపుపై ప్రజల ఆగ్రహం
    చెత్త పన్ను పెంచడంపై.. సీఎం జగన్ సొంత జిల్లాలోనే ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. గత్యంతరం లేని స్థితిలో..కడప వైకాపా కార్పొరేటర్లు ప్రజలకు మద్దతు నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పన్ను వసూలుపై సిబ్బంది అవగాహన లేకుండా వ్యవహరించారంటూ.. వారిపైకి నెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఆస్ట్రేలియా ‘భారత రత్న’ అందుకున్నా: జగదీశ్‌ చెన్నుపాటి
    Jagadeesh Chennupati: ఊళ్ళో కిరోసిన్‌ దీపం గుడ్డి వెలుతురులో చదువుకున్నవాడే.. బడి కోసం రోజూ ఆరు కిలోమీటర్లు నడిచినవాడే.. నేడు ‘నానో టెక్నాలజీ’ సాంకేతికతలో ప్రపంచ దిగ్గజ శాస్త్రవేత్తల్లో ఒకడయ్యాడు జగదీశ్‌ చెన్నుపాటి. ఆస్ట్రేలియా అందించే అత్యున్నత పౌరపురస్కారం ‘కంపానియన్‌ ఆఫ్‌ ఆర్డర్‌’ని అందుకున్నాడు.. మనదేశంలోని ‘భారతరత్న’స్థాయి గౌరవం అది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మంకీపాక్స్​ కలవరం.. భారత్​లో పెరుగుతున్న కేసులు.. ఆ దేశాలు అలర్ట్
    Monkey Pox in India: కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ ప్రపంచ దేశాలను మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ 75 దేశాలకు వ్యాప్తి చెందగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్య అత్యవసర స్థితి విధించింది. భారత్‌లోనూ మరో మంకీపాక్స్‌ కేసు నమోదైంది. ఇప్పటికే కేరళలో మూడు మంకీపాక్స్‌ కేసులు నమోదవ్వగా.. తాజాగా దిల్లీలో ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఎనిమిదేళ్ల బాలికపై.. స్కూల్​ టాయిలెట్​లో అత్యాచారం!
    నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. మరోవైపు హిందువునని నమ్మించి ఓ అమ్మాయిని ప్రేమలోకి దింపాడు ఓ వ్యక్తి. గత ఐదేళ్లుగా శారీరకంగా ఆమెను వాడుకున్నాడు. బ్లాక్​మెయిల్ చేసి ప్రియురాలి సోదరిపైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఝూర్ఖండ్​లోని సిమ్డేగాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • లంక అధ్యక్ష భవనంలో 1000 కళాఖండాలు మాయం!
    Srilanka President Office Artefacts: ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు శ్రీలంక అధ్యక్ష భవనాన్ని, ప్రధాని నివాసాన్ని ఇటీవల ఆక్రమించుకున్నప్పుడు దాదాపు వెయ్యికిపైగా కళాఖండాలు మాయమయ్యాయని పోలీసులు తెలిపారు. వీటిలో పలు పురాతన వస్తువులూ ఉన్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'యువతే మా టార్గెట్.. మేం కూడా విద్యుత్ స్కూటర్​ తీసుకొస్తాం'
    Yamaha two wheeler: యువత సరికొత్త హంగులు ఉన్న ద్విచక్ర వాహనాలపైనే మొగ్గు చూపిస్తున్నారని యమహా మోటారు ఇండియా గ్రూపు ఛైర్మన్ ఐషిన్‌ చిహానా అన్నారు. విదేశాల్లో లభ్యమవుతున్న వాహనాలు ఇక్కడా అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • బల్లెం విసిరితే రికార్డులే.. ఊబకాయాన్ని జయించి స్ఫూర్తిగా నిలచి..
    ఒలింపిక్​ గోల్డ్ విజేత నీరజ్​ చోప్రా మరోసారి అదరగొట్టాడు. అమెరికాలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో పాల్గొన్న చోప్రా సిల్వర్​ మెడల్​ సాధించాడు. ఒకప్పుడు అసలు పరుగు తీయమంటేనే బద్ధకించే నీరజ్​.. ఇప్పుడు పతకాల వేట కొనసాగిస్తున్నాడు. ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టని ఓ వ్యక్తి దేశం గర్వించే ఛాంపియన్​ అవుతాడని ఊహించారా? కానీ, అదే జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'కల నిజమైన వేళ'.. ఆ క్షణాల గురించి హీరోయిన్లు ఏమంటున్నారంటే?
    మనం అనుకున్నది ఏదైనా జరిగితే కల నిజమైందంటూ ఎగిరి గంతేసినంత పనిచేస్తాం కదూ.. ఈ నాయికలకు కూడా ఒకప్పుడు కొన్ని కలలు ఉండేవట. ఇంతకీ అవేంటో ఆ కలలు నిజమైన సందర్భాలెప్పుడో చూద్దామా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.