ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 1PM

author img

By

Published : Dec 20, 2021, 1:00 PM IST

ప్రధాన వార్తలు @ 1PM
ప్రధాన వార్తలు @ 1PM

.

  • కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్ల ప్రవేశం రద్దు..!

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్ల ప్రవేశాన్ని నిషేధిస్తూ... స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. వారు కార్యాలయంలోకి రావడం వల్లే అవినీతి జరుగుతోందని ఏసీబీ నివేదిక ఇచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ARUDROTHSAVALU: ఘనంగా ఆరుద్రోత్సవాలు.. శివయ్యకు అన్నాభిషేకాలు..!

రాష్ట్రవ్యాప్తంగా ఆరుద్ర నక్షత్ర మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేేకువజాము నుంచే అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. రాష్ట్రమంతా శివ నామస్మరణతో మార్మోగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Cyber Crime: కేసు వాపస్‌ తీసుకుంటే రూ.1.50కోట్లు ఇచ్చేస్తా.. సైబర్‌ కేటుగాడి ఆఫర్‌!

క్కడుంటారో.. వారి పేరేంటో.. ఏం చేస్తుంటారో.. ఎవరో.. ఏం తెలియదు. కానీ స్నేహితుల్లా పరిచయమవుతారు. స్నేహంగా నమ్మిస్తారు. అమాయకుల అవసరాలను ఆసరా చేసుకుంటారు. వారిని బురిడీ కొట్టించి వారి దగ్గరున్న సొమ్మంతా కాజేస్తారు. ఇప్పటి వరకు జరిగిన సైబర్ నేరాల్లో సైబర్ నేరస్థుల వ్యవహారశైలి ఇది. ఎప్పుడో ఓ సారి.. ఎక్కడో అక్కడ కొందరు పట్టుబడుతున్నారు. వారి నుంచి పోలీసులు వీలైనంత వరకు సొమ్ము రికవరీ చేస్తున్నారు. కానీ హైదరాబాద్​లో ఓ కంపెనీని మోసం చేసిన సైబర్ కేటుగాళ్లలో కొందరిని పోలీసులు అరెస్టు చేస్తే.. కంప్లెయింట్ వాపస్ తీసుకుంటే.. తాను తీసుకున్న డబ్బంతా తిరిగి ఇచ్చేస్తానని ఓ వ్యక్తి బాధితుడికి మెయిల్ చేసిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Woman Selfie Video Viral: 'మా కుటుంబానికి ప్రాణ హాని ఉంది.. కాపాడండి..'

Woman Selfie Video Viral: తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొంటూ.. ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసింది. తమకు న్యాయం చేయాలని వీడియోలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • శబరిమలలో ఆంక్షల సడలింపు- మరింత మంది భక్తులకు అవకాశం

Sabarimala News: శబరిమలలో ఆంక్షలు సడలిస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. రోజుకు 60వేల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఐశ్వర్య రాయ్​కు ఈడీ నోటీసులు.. విచారణకు గైర్హాజరు

Aishwarya ED notice: ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్​కు ఈడీ నోటీసులు పంపించింది. పనామా పత్రాల కేసులో తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, సోమవారం విచారణకు రాలేనని ఐశ్వర్య.. ఈడీ వర్గాలకు తెలిపినట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 7వ అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి

Girl fell down naked: విశాలవంతమైన అపార్ట్​మెంట్​లోని 7వ అంతస్తు నుంచి ఓ యువతి నగ్నంగా కిందపడింది. ఈ ఘటన గ్రేటర్​ నోయిడాలో జరిగింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • జపాన్ కుబేరుడి స్పేస్ టూర్ సక్సెస్.. సేఫ్​గా భూమికి..

Japanese billionaire space: జపాన్ కుబేరుడి అంతరిక్ష యాత్ర దిగ్విజయంగా ముగిసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరి సురక్షితంగా భూమిని చేరుకున్నారు జపాన్ దిగ్గజ వ్యాపారవేత్త యుసాకు మెజవా. 2009 తర్వాత సొంత ఖర్చులతో అంతరిక్షానికి వెళ్లిన పర్యటకుడిగా రికార్డుకెక్కారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Ashes 2021: చివరి మూడు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టిదే

Australia Squad for Ashes: యాషెస్ సిరీస్​లో భాగంగా మిగిలిన మూడు టెస్టులకు జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా. రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్ కమిన్స్, హేజిల్​వుడ్​ తిరిగి జట్టులోకి వచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఆర్​ఆర్​ఆర్'​లో అదిరిపోయే సీన్.. సీక్రెట్ రివీల్ చేసిన జక్కన్న

Rajamouli: 'ఆర్​ఆర్​ఆర్'​ ట్రైలర్​తో సినిమాపై అంచనాలు అంబరాన్నంటాయి. సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి అదిరిపోయే ఓ సీక్రెట్​ను పంచుకున్నారు దర్శకుడు రాజమౌళి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.