ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM

author img

By

Published : Jul 26, 2021, 3:02 PM IST

TOP NEWS
ప్రధానవార్తలు @3PM

..

  • Disha App: దిశ యాప్ సహాయంతో.. యువతిని కాపాడిన పోలీసులు!
    ఆపదలో ఉన్న యువతిని.. దిశ యాప్ కాపాడింది. ఉద్యోగం నిమిత్తం తన వేరే ఊరికి వెళ్లాలనుకున్న యువతికి.. తాను ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం కలిగింది. వెంటనే బాధిత యువతి తన సోదరికి విషయం తెలియజేసింది. తను దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. యువతికి రక్షణ కల్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • somu veerraju: ఎమ్మిగనూరు ఎమ్మెల్యేపై సీఎం వైఖరి ఏంటి?: సోము వీర్రాజు
    హిందువులపై దాడులు జరుగుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. గోవుల చట్టంపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యేపై సీఎం వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • YS Viveka: 50వ రోజూ సీబీఐ విచారణ.. వివేకా ఇంటిని పరిశీలించిన అధికారులు}
    మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వరుసగా 50వ రోజూ సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ అధికారులు.. గంటన్నరకుపైగా వివేకా ఇంటితోపాటు, పరిసరాలు పరిశీలించారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. వివేకా హత్య కేసులో సునీల్‌ కుమార్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మానవ రహిత అంతరిక్ష యాత్ర ఈ ఏడాది అసాధ్యం'
    మొట్టమొదటి మానవ రహిత అంతరిక్ష యాత్ర ఈ ఏడాది సాధ్యం కాదని ఇస్రో ఛైర్మన్​ కే శివన్​ స్పష్టం చేశారు. వచ్చే ఈ ఏడాది మిషన్​ను చేపట్టనున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా తలెత్తిన పరిస్థితులే ఇందుకు కారణమన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వరుణుడి పంజాకు 164 మంది బలి- ఊళ్లన్నీ జలమయం
    మహారాష్ట్రలో వరదలు బీభత్సం సృష్టించాయి. కొల్హాపుర్​ షిరోలీ ప్రాంతంలోని ఇళ్లు, రోడ్లు, వాణిజ్య భవంతులు పూర్తిగా నీట మునిగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని ఎన్​డీఆర్​ఎఫ్​ అధికారి తెలిపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కేంద్రం కీలక నిర్ణయం- తగ్గనున్న పప్పుల ధరలు!
    భారీగా పెరుగుతున్న పప్పుల ధరలు నియంత్రించి, దేశీయంగా సరఫరాను పెంచే ఉద్దేశంతో ఎర్ర కంది పప్పు​పై దిగుమతి సుంకాన్ని మాఫీ చేసింది కేంద్రం. దీనితోపాటు.. పప్పు ధాన్యాలపై వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సుంకం​(ఏఐడీసీ)ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • యడియూరప్ప రాజీనామా- భవిష్యత్​పై కీలక వ్యాఖ్యలు
    కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. రాజ్​భవన్​కు వెళ్లి గవర్నర్​కు రాజీనామా లేఖ సమర్పించారు. పార్టీ కోసం తాను ఒంటరిగా పోరాడానని చెప్పుకొచ్చారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టెడ్​టాక్​లో ఏడేళ్ల చిన్నారి.. పిల్లల పెంపకంపై స్పీచ్
    టెడ్​టాక్​ వేదికపై ఏడేళ్ల చిన్నారి అదరగొట్టింది. ఏ మాత్రం భయం లేకుండా గలగలా మాట్లాడేసింది. పిల్లల పెంపకంలో ఏమేం జాగ్రత్తలు పాటించాలో పెద్దలకు ఉదాహరణలతో సహా వివరించింది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చెప్పిందో మీరు చదివేయండి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శిష్యురాలికి గోల్డ్​ మెడల్​- గంతులేసిన కోచ్​!
    ఓడిన ప్లేయర్ల కంటతడి దృశ్యాలు ఓ వైపు.. గెలిచిన వాళ్ల విజయోత్సవాలు మరోవైపు. ఇలా.. ఎన్నో విభిన్న ఘట్టాలకు సాక్ష్యంగా నిలుస్తోంది టోక్యో ఒలింపిక్స్​. ఇదే తరహాలో.. తన శిష్యురాలు పసిడి పతకం గెలచిందని ఓ గురువు తెగ ఆనందపడిపోయాడు. స్టాండ్స్​లో అదిరిపోయే రేంజ్​లో చిందులేశాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పోలీస్ గెటప్​లో పవన్ న్యూలుక్​​​​.. ఫ్యాన్స్​లో జోష్​
    'అయ్యప్పనుమ్​ కోషియుమ్​'(Ayyappanum Koshiyum Remake) తెలుగు రీమేక్​ షూటింగ్​ తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పవన్​ పోలీస్​​​ లుక్​ను విడుదల చేశారు. ​దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.