ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

author img

By

Published : Mar 28, 2021, 1:00 PM IST

..

Top News
ప్రధాన వార్తలు

  • రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ హోలీ శుభాకాంక్షలు

హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్​ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. పండుగ జరుపుకోవాలని కోరారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

రాజధాని అమరావతి కోసం పోరాటంలో పాల్గొంటున్న మరో రైతు.. ప్రాణాలు కోల్పోయారు. అబ్బరాజుపాలేనికి చెందిన.. మహిళా రైతు కంచర్ల విజయలక్ష్మి గుండెపోటుతో మరణించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశాఖలో రూ.53 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం పట్టివేత

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్‌గేట్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.53 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'భాజపాకు బంగాల్​లో మెజారిటీ- అసోంలో అధికారం'

బంగాల్​ తొలి విడత పోలింగ్​లో ఓటింగ్ సరళిని బట్టి భాజపా అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమవుతోందని కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్ పేర్కొన్నారు. అసోంలో భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ మరోసారి అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పాముల విషం కోసం భారీ డీల్​

పాముల విషాన్ని అక్రమంగా అమ్ముకుంటున్న ముఠా గుట్టురట్టు చేశారు ఒడిశా భువనేశ్వర్​లోని అటవీ శాఖ అధికారులు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సాగు చట్టాలు లేనిదే రైతు ఆదాయం రెట్టింపు అసాధ్యం'

సాగు చట్టాల అమలు వెంటనే జరగకపోతే 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం సాధ్యమయ్యే పని కాదని అభిప్రాయపడ్డారు నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్​ చంద్. సాగు చట్టాల రద్దు కోరుతూ ఉద్యమం చేస్తున్న రైతు సంఘాలు... చట్టంలోని ప్రతి క్లాజ్​ను క్షుణ్నంగా చర్చించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించాలని కోరారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇండోనేసియాలో చర్చిపై ఆత్మాహుతి దాడి

ఇండోనేసియా సులవేసి ఐలాండ్​లోని రోమన్​ క్యాథలిక్​ చర్చిపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 9 మందికిపైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 4 కోట్ల పాత వాహనాలపై హరిత పన్ను!

వాతావరణాన్ని కాపాడేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు 15 ఏళ్లకుపైబడిన పాత వాహనాలపై హరిత పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇలాంటి వాహనాలు దేశంలో ఇప్పటివరకు 4 కోట్లు ఉన్నట్లు గుర్తించింది. వీటిపై హరిత పన్ను విధించే ప్రతిపాదనను రాష్ట్రాలకు పంపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మన్​ కీ బాత్'​: మిథాలీ, సింధుపై మోదీ ప్రశంసలు

ఆదివారం జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్, స్టార్ షట్లర్ పీవీ సింధు, ప్రపంచకప్​లో అదరగొట్టిన మహిళ షూటర్లపై ప్రశంసలు కురిపించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫిల్మ్​ఫేర్​ 2021: తారలు కదిలొచ్చిన వేళ!

ముంబయిలో 66వ ఫిల్మ్​ఫేర్​ అవార్డుల వేడుక శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా బాలీవుడ్​ హీరోలు రాజ్​కుమార్​ రావ్​, రితీశ్​ దేశ్​ముఖ్​ వ్యవహరించారు. ఇందులో ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్​, ఉత్తమ నటిగా తాప్సీ ఎంపికవ్వగా.. ఉత్తమ చిత్రంగా తాప్సీ నటించిన 'తప్పడ్​' నిలిచింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.