ETV Bharat / city

నేడు రైతుల ఖాతాలో బీమా సొమ్ము

author img

By

Published : Dec 15, 2020, 3:33 AM IST

గతేడాది ఖరీఫ్ సీజన్​లో పంట నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద రూ.1,252కోట్లను ప్రభుత్వం ఇవాళ అందించనుంది. ఈ మెుత్తాన్ని 9.48 లక్షల మంది ఖాతాల్లో జమ చేస్తారు.

YSR Free Crop Insurance Scheme
నేడు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద పరిహారం పంపిణీ

విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు.... వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద పరిహారాన్ని ప్రభుత్వం ఇవాళ అందించనుంది. 9 లక్షల 48 వేల మంది రైతులకు సుమారు 12 వందల 52 కోట్ల రూపాయల బీమా చెల్లించనుంది. 2019 సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు ఈ పరిహారం అందనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించనున్నారు.

రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ మొత్తాన్ని నేరుగా జమచేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. రైతులపై ఎలాంటి భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తోంది. భూమి సాగు చేస్తూ.... ఈ-క్రాప్‌లో రైతులు నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్నీ బీమా పరిధిలో చేర్చి... ప్రభుత్వమే బీమా ప్రీమియమ్‌ చెల్లించనుంది.

ఇదీ చదవండి:

వైఎస్ జలకళ పథకానికి సవరణలు.. ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.