ETV Bharat / city

Kidnap: నవవధువు కిడ్నాప్... ఆ తర్వాత ఏమైందో తెలుసా..!

author img

By

Published : Jun 24, 2021, 3:01 PM IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న నవవధువును సినీఫక్కీలో అపహరించి... తన భర్తపై దాడికి పాల్పడిన ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అపహరణకు గురైన నవవధువును తన భర్త వద్దకు చేర్చి... వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చట్టప్రకారం, ఇష్టపూర్తిగా ప్రేమ వివాహం చేసుకున్న మేజర్లను వారి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి చేస్తే శిక్ష అర్హులని తెలిపారు.

Kidnap
నవవధువు కిడ్నాప్

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో సినీ ఫక్కీలో నవవధువు కిడ్నాప్ జరిగింది. కరుణాకర్ అనే యువకుడికి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయాన్ని వారు పెద్దలకు తెలియజేయగా పెళ్లికి నిరాకరించారు. చేసేదేమీలేక సదరు ప్రేమజంట ఈనెల 15న ప్రేమవివాహం చేసుకుని సుల్తానాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువురి కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి, కొత్త జంటను సుల్తానాబాద్‌లోని కరుణాకర్‌ ఇంటికి పంపించారు.

ఈ ప్రేమ వివాహం సదరు నవవధువు తండ్రికి ఇష్టం లేకపోవడంతో... ఎలాగైనా తన కూతురిని తన వద్దకు తెచ్చుకోవాలనే దురుద్దేశంతో ముగ్గురు వ్యక్తులతో కిడ్నాప్ చేశారు. బాధితుడు కరుణాకర్ సుల్తానాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కొంతమంది వచ్చి తనను చితకబాది, భార్యను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు వెల్లడించాడు. తన భార్యను అపహరించి తీసుకెళ్లిన దుండగులను శిక్షించి తనకు న్యాయం చేయాలని కోరాడు.

బాధితుడి ఫిర్యాదు చేయడంతో ముగ్గురు నిందుతులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ సారంగపాణి తెలిపారు. ఈ కిడ్నాప్‌కు కారణమైన నవవధువు తండ్రి సత్తయ్య పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అపహరణకు గురైన నవవధువును తన భర్త వద్దకు చేర్చి... వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చట్టప్రకారం ఇష్టపూర్తిగా ప్రేమ వివాహం చేసుకున్న మేజర్లను వారి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి చేస్తే శిక్షార్హులేనని తెలిపారు.

ఇదీ చదవండి:

SON KILLED FATHER: కన్నతండ్రిని కడతేర్చాడు.. కట్టు కథ అల్లాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.