ETV Bharat / city

Smart Cities: స్మార్ట్‌ సిటీలకు నిధుల గండం..

author img

By

Published : Jul 19, 2022, 4:11 AM IST

Smart Cities: రాష్ట్రంలోని స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్లకు సంబంధించిన నిధుల తిరిగి చెల్లింపులో ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో పనుల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమరావతి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాల్లో కలిపి ఇప్పటివరకు రూ.2,798 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నాలుగు నగరాలకు సంబంధించి ఆర్థికశాఖ నుంచి సుమారు రూ.1,260 కోట్లు రావాల్సి ఉంది.

స్మార్ట్‌ సిటీ
స్మార్ట్‌ సిటీ

Smart Cities: రాష్ట్రంలోని స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్లకు సంబంధించిన నిధుల తిరిగి చెల్లింపులో ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో పనుల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక్కో స్మార్ట్‌ సిటీలో రూ.1,000 కోట్లతో ఏడేళ్ల క్రితం పనులు ప్రారంభించాయి. అమరావతి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాల్లో కలిపి ఇప్పటివరకు రూ.2,798 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నాలుగు నగరాలకు సంబంధించి ఆర్థికశాఖ నుంచి సుమారు రూ.1,260 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులు విడుదలైతే పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్లు భావిస్తున్నాయి.

అనుసంధానం సరే.. నిధులేవీ?

స్మార్ట్‌సిటీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా నిధులకు సంబంధించిన పీడీ ఖాతాలను ఇదివరకే ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు (సీఎఫ్‌ఎంఎస్‌) అనుసంధానించారు. పూర్తయిన పనుల బిల్లులను స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ ఇంజినీర్లు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేస్తే.. ఆర్థికశాఖ నిధులిస్తోంది. ఈ క్రమంలో తీవ్ర జాప్యమై పనులు మందగిస్తున్నాయి. 4 నగరాల్లో ఇప్పటికే చేసిన పనులకు రూ.400 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పథకాలు, ప్రాజెక్టుల అమలుకు తాము విడుదల చేసే నిధులకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచి ప్రజా ఆర్థిక నిర్వహణ వ్యవస్థకు (పీఎఫ్‌ఎంఎస్‌) అనుసంధానించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అధికారులు 4 నెలల కిందటే పీఎఫ్‌ఎంఎస్‌కు స్మార్ట్‌ సిటీ ఖాతాలను అనుసంధానించారు. దీంతో సీఎఫ్‌ఎంఎస్‌తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల పరిధిలోనే నిధుల లభ్యత మేరకు అధికారులు బిల్లులు చెల్లించవచ్చు. అయితే 4 స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్లకు రావాల్సిన రూ.1,260 కోట్లను ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుని, తిరిగి ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. దీంతో పనులు మందగించాయి. విశాఖపట్నం, తిరుపతిల్లో ప్రారంభించిన పనులపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. స్మార్ట్‌సిటీల్లో రూ.2,864 కోట్ల అంచనాలతో చేపట్టిన 115 ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

..

ఇవీ చదవండి: POLICE APP: యాప్‌ పసిగట్టింది..బుల్లెట్‌ దొరికింది

రహదారిపై గుంతలకు వైకాపా రంగులు.. తాడేపల్లిలో జనసేన వినూత్న నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.