ETV Bharat / city

నేడు, రేపు తెదేపా మాక్‌ అసెంబ్లీ...స్పీకర్‌గా ఎమ్మెల్యే డీబీవీ స్వామి!

author img

By

Published : May 20, 2021, 9:18 AM IST

రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్షం తెదేపా బహిష్కరించింది. రెండ్రోజులు మాక్ అసెంబ్లీకి తెదేపా శాసనసభాపక్షం నిర్ణయం తీసుకుంది. గురువారం 4 నుంచి 6.30 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాక్‌ అసెంబ్లీ నిర్వహించనుంది.

TDP boycott the state annual budget meeting
నేడు, రేపు తెదేపా మాక్‌ అసెంబ్లీ

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశం బహిష్కరణకు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా గురువారం సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాక్‌ అసెంబ్లీ నిర్వహించనుంది. స్పీకర్‌గా కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి వ్యవహరిస్తారని తెలిపింది. ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్‌ శాసనసభా వ్యవహారాలు, ఆర్థికశాఖల మంత్రిగా, దువ్వారపు రామారావు వైద్య, ఆరోగ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పౌరసరఫరాలు, బుద్ధా వెంకన్న జలవనరులు, బుద్ధా నాగజగదీష్‌ దేవాదాయ, ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్‌ వ్యవసాయం, గద్దే రామ్మోహన్‌ హోంశాఖ మంత్రులుగా వ్యవహరిస్తారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు జీరో అవర్‌ సమన్వయకర్తగా ఉంటారు.

మొదటి రోజు కొవిడ్‌పై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తామని, ప్రభుత్వ వైఫల్యాలపై వీడియోలు, క్లిప్పింగ్‌లు ప్రదర్శిస్తామని తెదేపా తెలిపింది. దీనిపై దువ్వారపు రామారావు సమాధానం ఇచ్చిన అనంతరం, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష నేత ప్రసంగం ఉంటుందని వెల్లడించింది.

రెండో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యం, దిశ బిల్లు పేరుతో మోసం, పింఛను పెంపులో మోసం, ధరల పెరుగుదల, కార్పొరేషన్ల పేరుతో మోసం అన్న అంశాల్ని ప్రస్తావిస్తారు.

ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలతో ఒరిగేదేంటి?
'ప్రభుత్వం కూలిపోతుందన్న భయంతో నిర్వహిస్తున్న ఒక్కరోజు సమావేశాల్లో ప్రజల సమస్యలు చర్చకు వస్తాయా? ప్రతిపక్షానికి అవకాశమిస్తారా? అందుకే ప్రభుత్వ తీరును నిరసిస్తూ రెండు రోజులపాటు మాక్‌ అసెంబ్లీ నిర్వహిస్తున్నామ’ని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తెలిపారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను బహిష్కరించడం పార్టీ చరిత్రలో ఇదే మొదటిసారని తెదేపా సీనియర్‌ నేతలు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

'మొహం చెల్లకే అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.