ETV Bharat / city

రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు..!

author img

By

Published : May 21, 2021, 7:27 AM IST

cyclone effect
తుపాను ప్రభావం

రానున్న 48గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 24న ఇవి మరింత తీవ్రమై తుపానుగా మారవచ్చని తెలిపారు.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో ప్రవేశిస్తాయి. ఈ నెల 22న ఉత్తర అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. 24న ఇది మరింత బలపడి తుపానుగా మారవచ్చు. దీని ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్రలో శుక్రవారం ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. శనివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. రాయలసీమలో శుక్ర, శనివారాల్లో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి’ అని వివరించింది.

ఇదీ చదవండీ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నేడు హైకోర్టులో తీర్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.