ETV Bharat / city

సీఐడీ కేసులో చంద్రబాబు, నారాయణకు ఊరట

author img

By

Published : Mar 19, 2021, 5:24 PM IST

Updated : Mar 19, 2021, 6:20 PM IST

Chandrababu Quash petition
సీఐడీ కేసులో చంద్రబాబుకు ఊరట

17:08 March 19

సీఐడీ విచారణపై హైకోర్టు స్టే

రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై హైకోర్టు 4వారాల పాటు స్టే విధించింది. సీఐడీ తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ చంద్రబాబు, నారాయణ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రా, నారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి పాలకపక్షం కేసు పెట్టినందున అరెస్టు సహా తదుపరి చర్యలు చేపట్టకుండా నిలువరించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. 

సంబంధిత కథనం:

చంద్రబాబు కేసు: సుప్రీం సీనియర్ న్యాయవాది ఏమన్నారంటే...

Last Updated : Mar 19, 2021, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.