ETV Bharat / city

ఉండవల్లి గుహల వద్ద మరోసారి ఉద్రిక్తత.. పోలీసుల తీరుపై నేతల ఆగ్రహం

author img

By

Published : Jun 25, 2022, 5:22 PM IST

Updated : Jun 25, 2022, 10:38 PM IST

tension at undavalli
tension at undavalli

17:17 June 25

ప్రజావేదిక శిథిలాల వద్దకు వెళ్లేందుకు తెదేపా నేతల ప్రయత్నం

ఉండవల్లి గుహల వద్ద మరోసారి ఉద్రిక్తత

Tension at undavalli: అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజావేదిక కూల్చివేసి మూడేళ్లైన నేపథ్యంలో ఆ శిథిలాల వద్దకు వెళ్లేందుకు తెదేపా ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో తెదేపా నేతలు ఆనంద్‌బాబు, అశోక్ బాబు, సత్యనారాయణరాజు, పట్టాభిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతల రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. రోడ్డుపై నిరసన తెలుపుతున్న తెలుగుయువత, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ప్రజావేదిక కూల్చి 3 ఏళ్లయిన నేపథ్యంలో ఆ శిథిలాల వద్ద ఆందోళన చేసేందుకు వెళ్తున్న తెదేపా నాయకుల్ని పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అధికారంలోకి రాగానే ప్రజా వేదిక కూల్చిన వైకాపా ప్రభుత్వం.. ఈ మూడేళ్ల కాలంలో ప్రజలకు పనికి వచ్చే ఒక నిర్మాణమైనా చేపట్టిందా? అని తెదేపా నేత పట్టాభి నిలదీశారు. ప్రజా వేదిక కూల్చివేతతో రాష్ట్రంలో వైకాపా విధ్వంసపాలన ప్రారంభమైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు. ప్రజా వేదిక వద్దకు వెళ్లకుండా నేతలపై ఆంక్షలు విధించటంపై అశోక్‌బాబు మండిపడ్డారు.

ప్రజావేదిక ఆ శిథిలాల వద్ద ఆందోళన చేసేందుకు వెళ్తున్న తెలుగు యువతను ఉండవల్లి గుహల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ప్రజావేదిక కూల్చివేతకు వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులతో పెనుగులాటలో పలువురు తెలుగుయువత నేతలు గాయపడ్డారు. పోలీసుల కళ్లుగప్పి ప్రజావేదిక వద్దకు పలువురు వెళ్లాగా.. పొలాల నుంచి వచ్చిన తెలుగుయువత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీచదవండి:

Last Updated :Jun 25, 2022, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.