ETV Bharat / city

TS GOVERNOR TAMILISAI: కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై నిర్ణయం తీసుకోలేదు: తెలంగాణ గవర్నర్

author img

By

Published : Sep 8, 2021, 4:18 PM IST

Tamilisai
Tamilisai

గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కౌశిక్​ రెడ్డిని (Koushik Reddy) మంత్రివర్గం చేసిన సిఫార్సు పెండింగ్​లో ఉండడంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై (Tamilisai Soundararajan ) స్పందించారు. కేబినెట్ చేసిన సిఫార్సును ఇంకా ఆమోదించకపోవడంపై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఎందుకు ఆలస్యం అయిందో కారణాలను వివరించారు.

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై ..

తెలంగాణలో తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డిని (Koushik Reddy) ఎమ్మెల్సీగా నియమించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్​ (Tamilisai Soundararajan) తెలిపారు. కౌశిక్‌రెడ్డి నియామకానికి సంబంధించి మంత్రివర్గం సిఫార్సు చేసిందని చెప్పారు. ఆ సిఫార్సును మరింత అధ్యయనం చేయాల్సి ఉందని గవర్నర్‌ తెలిపారు. సామాజిక సేవా విభాగంలో పంపినందున పరిశీలిస్తున్నానని వివరించారు. గవర్నర్​గా రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్​భవన్​లో నిర్వహించిన కార్యక్రమంలో పాతిక్రేయులతో చిట్​చాట్​ చేశారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్సీగా కౌశిక్​ రెడ్డి అభ్యర్థిత్వం పెండింగ్​లో ఉందని గవర్నర్​ (Tamilisai Soundararajan) సమాధానం ఇచ్చారు.

గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ స్థానానికి ఎంపిక చేస్తూ రాష్ట్ర కేబినెట్ సిఫార్సు చేసినప్పటికీ ఆ ఫైల్ తన వద్ద పెండింగ్​లో ఉన్నట్టు గవర్నర్​ తెలిపారు. ఆ స్థానాన్ని సామాజిక సేవ చేసిన వారికి ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి చేసిన సేవలకు సంబంధించి తాను మరింత పరిశీలించాల్సి ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎంపికపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

'కౌశిక్​ రెడ్డి నియామకంపై మంత్రివర్గం సిఫార్సు చేసింది. మంత్రివర్గ సిఫార్సును మరింత అధ్యయనం చేయాల్సి ఉంది. సామాజిక సేవ విభాగంలో పంపినందున పరిశీలిస్తున్నాం. కౌశిక్​ రెడ్డి ఫైల్ పరిశీలనకు మరింత సమయం పట్టొచ్చు.'

- తమిళిసై సౌందర రాజన్​, గవర్నర్​

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరిన కౌశిక్‌రెడ్డిని నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా మంత్రివర్గం ఖరారు చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:

వైకాపా పేరు చెబితే పారిశ్రామిక వేత్తలు పరార్: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.