TS EAMCET counseling 2021: నేడు ఇంజినీరింగ్ ప్రత్యేక విడత కౌన్సిలింగ్

author img

By

Published : Nov 20, 2021, 9:35 AM IST

telangana-eamcet-special-round-counseling-starts-from-today

ఇవాళ్టి నుంచి టీఎస్​ ఇంజినీరింగ్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేడు, రేపు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించనున్నారు. మరోవైపు పీజీ ఈసెట్ తుది విడత ప్రవేశాల ప్రక్రియ కూడా నేటి నుంచే ప్రారంభం కానుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ (TS EAMCET counseling) ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులకు ఇవాళ, రేపు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ నెల 24వ తేదీన.. ఇంజినీరింగ్ ప్రత్యేక విడత సీట్లను కేటాయించనున్నారు. ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సిలింగ్‌ (TS EAMCET counseling) లో 59,993 సీట్లను కేటాయించగా.... 53,717 మంది కాలేజీల్లో చేరారు. మరో 6,279 మంది తమ సీటును రద్దు చేసుకున్నారు. ప్రత్యేక విడత కోసం.. 26,073 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈనెల 24 నుంచి 26 వరకు వెబ్​సైట్ ద్వారా బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు.. కాలేజీకి వచ్చి చేరాల్సి ఉంటుంది. ప్రత్యేక రౌండులో వచ్చిన సీటును రద్దు చేసుకునేందుకు ఈనెల 26 వరకు అవకాశం ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 25న మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు. తుది విడత కౌన్సెలింగ్ (TS EAMCET counseling) కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 వేల రూపాయలు.. మిగతా అభ్యర్థులు 10వేల రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. కాలేజీలో చేరిన తర్వాత ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తారు.

పీజీ ఈసెట్ తుది విడత ప్రవేశాలు

మరోవైపు పీజీ ఈసెట్ తుది విడత ప్రవేశాల ప్రక్రియ కూడా... నేడే ప్రారంభం కానుంది. ఈరోజు నుంచి ఈనెల 24 వరకు.. ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఇదే నెల 27, 28 తేదీల్లో పీజీ-ఈసెట్ తుది విడత వెబ్ ఆప్షన్లకు.. అవకాశం కల్పించనున్నారు. ఈనెల 30న ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తుది విడత సీట్లను కేటాయించనున్నారు.

ఇదీ చూడండి:

TS Eamcet counselling 2021: ఎంసెట్‌ తుది విడత సీట్లు ఎన్నంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.