ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నిక అక్రమాలపై సీఈసీకి చంద్రబాబు లేఖ

author img

By

Published : Apr 17, 2021, 4:53 PM IST

తిరుపతి అసెంబ్లీ పరిధిలో పోలింగ్‌ రద్దు చేసి, కేంద్ర బలగాలతో తిరిగి ఎన్నిక నిర్వహించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

chandra babu wrote letter to Central election commission
chandra babu wrote letter to Central election commission

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్‌ రద్దు చేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో జరిగిన అక్రమాలపై తగు చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లవుతుందని లేఖలో పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో స్థానికేతరులు వేలకొద్దీ దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. దొంగ ఓట్ల నియంత్రణలో పోలీసులు, అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు.

తిరుపతిలో ఉండి.. అక్రమాలకు పాల్పడుతున్న స్థానికేతరుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు వేసేవారిని పట్టించిన తెదేపా శ్రేణులను అరెస్టు చేశారని లేఖలో తెలిపారు. వారిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. అక్రమాలకు సంబంధించిన వీడియో, ఫోటో ఆధారాలను తన ఫిర్యాదుకు జత చేశారు.

ఇదీ చదవండి: 'బయటి వ్యక్తులు, వాహనాలు రాకుండా చర్యలు తీసుకున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.