ETV Bharat / city

తెలుగు భాషా వ్యాప్తికి కృషి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ

author img

By

Published : Jun 17, 2021, 7:14 AM IST

తెలుగు భాషా వ్యాప్తికి శాయశక్తులా కృషి చేస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.. జస్టిస్‌ రమణపై రాసిన ప్రశంసాపూర్వక పద్యాలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన భాషపై తన మనోభావాలు పంచుకున్నారు.

supreme court chief justice NV ramana talks about expend telugu languge
తెలుగు భాషా వ్యాప్తికి కృషి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ

తెలుగు భాషా వ్యాప్తికి శాయశక్తులా కృషి చేస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. రాజ్‌భవన్‌లో బుధవారం తనను కలిసిన తెలుగు భాషావేత్తలతో ఆయన ముచ్చటించారు. మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘మీరు నాడు హైకోర్టు జ్యుడిషియల్‌ అకాడమీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో నేను ఉమ్మడి రాష్ట్రంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నా. ఆ సమయంలో మనం న్యాయవ్యవస్థలో తెలుగు భాష వాడుకకు సంబంధించి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాం’’ అని సీజేఐకు గుర్తు చేశారు. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు జస్టిస్‌ రమణపై రాసిన ప్రశంసాపూర్వక పద్యాలను చదివి వినిపించారు. గంగాధరశాస్త్రి భగవద్గీతలోని శ్లోకాలను చెప్పారు. ఎమెస్కో ప్రచురించిన ‘తిరుపతి కథలు’ పుస్తకాన్ని జస్టిస్‌ రమణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమెస్కో అధినేత విజయకుమార్‌, ఆచార్య ఎన్‌.గోపి, గౌరిశంకర్‌, డి.విజయభాస్కర్‌, సుద్దాల అశోక్‌తేజ, వంగల అశ్వత్థామ, శిఖామణి, ఎస్‌.కొండలరావు, ఎం.రఘురాం, ఎం.ఉషాగాయత్రి, శర్మ, కె.రామచంద్రమూర్తి పాల్గొన్నారు.

తెలుగువారందరికీ గర్వకారణం

జస్టిస్‌ ఎన్‌వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అత్యున్నత పదవిని అధిష్ఠించడం తెలుగువారందరికీ గర్వకారణమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాజ్‌భవన్‌ అతిథిగృహంలో సీజేఐతో భేటీ అయి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, బి.విజయ్‌సేన్‌రెడ్డి కలిసి మాట్లాడారు.

సీజేఐని కలిసిన ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుల బృందం

* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణను ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుల బృందం బుధవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువాతో సత్కరించింది. ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేసింది. జస్టిస్‌ ఎన్‌వీ రమణను కలిసిన వారిలో ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు రోళ్ల మాధవి, జి.సుదర్శన్‌రావు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు ఎ.రామిరెడ్డి, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్‌, వజ్జా శ్రీనివాసరావు, చిత్తరువు నాగేశ్వరరావు, కె.చిదంబరం, ఎస్‌.బ్రహ్మానందరెడ్డి ఉన్నారు.

* జస్టిస్‌ ఎన్‌వీ రమణను ఏపీ హైకోర్టు సహాయ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ బుధవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇదీ చదవండి:

10th exams: పది పరీక్షలు జులై 26 నుంచి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.