ETV Bharat / city

ఉక్రెయిన్‌ నుంచి రాష్ట్రానికి చేరుకుంటున్న విద్యార్థులు

author img

By

Published : Feb 27, 2022, 5:23 AM IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొందరు తెలుగు విద్యార్థులు దిల్లీ, ముంబయి విమానాశ్రయాలకు చేరుకున్నారు .ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ (పీఆర్సీ) ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు.

Students arriving in the state from Ukraine
Students arriving in the state from Ukraine

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. తెలుగు విద్యార్థులు కొందరు రొమేనియాకు చేరుకున్నారు. వీరు విమానాల్లో భారత్‌కు బయలుదేరారు. కృష్ణా జిల్లా కౌతవరం గ్రామానికి చెందిన అనూష శనివారం తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడారు. తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేస్తున్నాయని తెలిపారు. దిల్లీ, ముంబయి విమానాశ్రయాలకు కొందరు విద్యార్థులు ఇప్పటికే చేరుకున్నారు.

విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు: ప్రవీణ్‌ ప్రకాష్‌
ఉక్రెయిన్‌ నుంచి దిల్లీ చేరుకున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ (పీఆర్సీ) ప్రవీణ్‌ ప్రకాష్‌ తెలిపారు. ఈ అంశంపై ఏపీ భవన్‌ ఉద్యోగులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఉక్రెయిన్‌ నుంచి దిల్లీ చేరుకునే విద్యార్థులను ఆహ్వానించడానికి ఏపీ భవన్‌ సిబ్బంది విమానాశ్రయంలో ఉంటారన్నారు. దిల్లీ చేరుకున్న తర్వాత భోజనం, వసతి, రవాణా సదుపాయం ఖర్చులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఉక్రెయిన్‌లో మొత్తం 1100 మంది తెలుగు విద్యార్థులున్నారని తెలిపారు. 700 మంది సమాచారం తమ దగ్గర ఉందని.. వారిలో 350 మంది ఏపీకి చెందినవారని ప్రవీణ్‌ ప్రకాష్‌ చెప్పారు.

...
  • ఉక్రెయిన్‌ నుంచి దిల్లీకి వచ్చిన ఏపీ విద్యార్థులు

* పోత వెంకటలక్ష్మీధర్‌రెడ్డి
* తెన్నెటి వెంకటసుమ
* అఫ్రాన్‌ అహ్మద్‌
* అమ్రితాన్స్‌
* వారణాసి శ్వేతశ్రీ
* రాజులపాటి అనూష
* సిమ్మ కోహిమావిశాలి
* వేముల వంశీకుమార్‌
* అభిషేక్‌ మంత్రి
* జయశ్రీ
* హర్షిత
* షేక్‌ ఫర్జాన కౌశర్‌
* సూర్య సాయికిరణ్‌

ఇదీ చదవండి : 250 మందితో దిల్లీ చేరిన రెండో విమానం.. విద్యార్థుల హర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.