ETV Bharat / city

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగాలి: శైలజానాథ్

author img

By

Published : Aug 24, 2020, 12:47 PM IST

పార్టీ నాయకత్వ మార్పు ఊహాగానాలపై అధినేత్రి సోనియాకు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ లేఖ రాశారు. అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగాలని ఆకాంక్షించారు.

sailajanath letter to sonia on congress president role
శైలజానాథ్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకత్వ మార్పుపై అధినేత్రికి ఆయన లేఖ రాశారు. ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుంచి పార్టీని గట్టెక్కించేందుకు సోనియా చేసిన కృషి మరవలేనిదని ప్రశంసించారు. తప్పని పరిస్థితుల్లో నాయకత్వ మార్పు ఆలోచన ఉంటే రాహుల్ గాంధీ ముందుకొస్తే ఆయనకే ఇవ్వాలని సూచించారు.

ఎంతో కాలం నుంచి పార్టీ పగ్గాలు రాహుల్ చేపట్టాలని శ్రేణులు ఆకాంక్షిస్తున్నట్లు శైలజానాథ్ చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ, లౌకికరాజ్య మనుగడకు రాహుల్ నాయకత్వం అవసరమని శైలజానాథ్ అన్నారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ తప్పకుండా పునర్వైభవం చూస్తుందని దీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని రక్షించే ధైర్యం గాంధీ కుటుంబానికే ఉందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లోనూ కరోనా వ్యాప్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.