ETV Bharat / city

అధికారులు తమ పరిధి మేరకే వ్యవహరించాలి:విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌

author img

By

Published : Apr 5, 2022, 3:21 PM IST

Updated : Apr 5, 2022, 4:55 PM IST

Retired IAS Office PV Ramesh: రాజ్యాంగం పరిధిలో నిబంధనల మేరకు పనిచేస్తే ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌ అభిప్రాయపడ్డారు. ఇటీవల హైకోర్టు 8 మంది ఐఏఎస్​లకు శిక్ష విధించడం దురదృష్టకరమన్నారు. వృత్తిరీత్యా రాజకీయ వ్యవస్థతో పనిచేయాల్సి ఉన్నా...అధికారులు తమ పరిధి మేరకే వ్యవహరించాలంటున్న పీవీ రమేశ్‌తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

Retired IAS Office PV Ramesh
పీవీ రమేశ్‌తో ముఖాముఖి

Retired IAS Office PV Ramesh: అధికారులకు కోర్టులు శిక్ష విధించడం అరుదని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అన్నారు. న్యాయవ్యవస్థ ఆదేశాలను అధికారులు పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. ఆదేశాలు పాటించని వారిని శిక్షించే అధికారం కోర్టులకు ఉందని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారుల్లోనూ విభజన వచ్చిందని...మంచిపోస్టు, చెడ్డ పోస్టు అంటూ వ్యత్యాసం చూపుతున్నారన్నారు.

నేతలకు దగ్గరగా ఉంటే మంచి పోస్టు వస్తుందన్న భావన పెరిగిపోయిందని తెలిపారు. ప్రాంతీయం, కులం వంటి జాడ్యాలు వచ్చి చేరాయన్నారు. భయపెట్టి పనిచేయిస్తున్నారని ఎవరైనా చెబితే నమ్మడం కష్టమే అన్నారు. ప్రజలకు సేవ చేసే ఏ పోస్టు అయినా మంచిదే అని స్పష్టం చేశారు.

విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌



ఇదీ చదవండి: Banjarahills pub case: పబ్‌లో తరచూ డ్రగ్స్‌ పార్టీలు.. హై ప్రొఫైల్‌ అతిథులు

Last Updated : Apr 5, 2022, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.