Platform ticket: రైల్వే ఫ్లాట్ ఫాం టికెట్ ధరలు పెంపు

Platform ticket: రైల్వే ఫ్లాట్ ఫాం టికెట్ ధరలు పెంపు
Railway Platform Ticket Prices Increase దసరా పండుగ సందర్భంగా రద్దీని నివారించేందుకు తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలోని కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20 వరకు పెంచినట్లు ప్రకటించింది. ఎప్పటివరకంటే..?
Railway Platform Ticket Prices Increase: దసరా పండగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతోంది. ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడంతో రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే.. తెలంగాణలోని కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచింది. పెంచిన ధరలు నేటి నుంచి అక్టోబర్ 9 వరకు అమలు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాచిగూడ రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫాం టికెట్ ధర రూ. 20 పెంచుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
ఇవీ చదవండి:
