ETV Bharat / city

మోదీ హైదరాబాద్​ పర్యటన.. 'మినిట్​ టూ మినిట్​' షెడ్యూల్​ ఇదే..!

author img

By

Published : Jul 1, 2022, 10:50 PM IST

Modi schedule for hyderabad visit
Modi schedule for hyderabad visit

Modi schedule for hyderabad visit: హైదరాబాద్​ వేదికంగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ సమావేశం నేపథ్యంలో ప్రధాని మోదీ రేపు నగరానికి రానున్నారు. సమావేశాలతో పాటు.. పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించనున్న బహిరంగ సభలోనూ మోదీ పాల్గొంటారు. అయితే.. మోదీ హైదరాబాద్​​ పర్యటన సందర్భంగా షెడ్యూల్​ ఎలా ఉంది.

Modi schedule in hyderabad: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం సిద్ధమైంది. సమావేశాల నిమిత్తం ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్య నేతలు రాష్ట్రానికి చేరుకోగా.. ఈరోజు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నగరానికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ.. రేపు హైదరాబాద్​ రానున్నారు. అయితే.. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు.

ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌ ఇదే..

  • శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో దిల్లీలో బయలుదేరి.. 2.55 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
  • బేగంపేట నుంచి 3.20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో హైటెక్స్‌లోని నోవాటెల్‌ హోటల్‌కు బయలుదేరుతారు.
  • 3.30 గంటలకు హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు. 3.30 గంటల నుంచి 4 గంటల వరకు రిజర్వ్‌ సమయంగా ఉంచారు.
  • సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. రాత్రి 9 గంటల నుంచి మిగతా సమయమంతా రిజర్వ్‌గా ఉంచారు.
  • ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కార్యవర్గ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్‌గా ఉంచారు.
  • సాయంత్రం 5.55 గంటలకు హైటెక్స్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 6.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో పరేడ్‌ గ్రౌండ్స్‌కు వెళ్తారు.
  • సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు సభలో పాల్గొంటారు.
  • రాత్రి 7.35 గంటలకు సభాస్థలి నుంచి బయలుదేరి.. రాజ్‌భవన్‌కు గానీ.. హోటల్‌కు గానీ చేరుకుని బస చేస్తారు.
  • సోమవారం ఉదయం 9.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఏపీకి బయలుదేరుతారు.
  • ఉదయం 10.10 గంటలకు విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి అల్లూరి జయంతి వేడుకల్లో పాల్గొంటారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.