ETV Bharat / city

దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలోనే విద్యుత్ లోటు తీవ్రం... స్పష్టం చేస్తున్న గణాంకాలు

author img

By

Published : Apr 10, 2022, 4:58 AM IST

Power shortage reasons in AP: దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలోనే విద్యుత్ లోటు తీవ్రంగా ఉన్నట్టు దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం దక్షిణాది గ్రిడ్‌కు అనుసంధానమై ఉన్న రాష్ట్రాలన్నింటికి కలిపి 24 మిలియన్ యూనిట్ల లోటు ఉంటే ఒక్క ఏపీలోనే 22 మిలియన్ యూనిట్ల లోటు ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు.

Power shortage reasons
Power shortage reasons

Power shortage reasons in AP: దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తీవ్రమైన విద్యుత్ లోటు కనిపిస్తోంది. దక్షిణాదిన గరిష్ఠంగా తమిళనాడు 373.99 మిలియన్ యూనిట్లను రోజువారీగా వినియోగించుకుంటోంది. తెలంగాణా 265 మిలియన్ యూనిట్లు, కర్ణాటక 277 మిలియన్ యూనిట్లు, కేరళ 79 మిలియన్ యూనిట్ల మేర వినియోగించుకుంటున్నాయి. అన్ని రాష్ట్రాలూ దాదాపుగా అదేస్థాయిలో విద్యుత్ డిమాండ్​కు అనుగుణంగా సరఫరా చేస్తున్నాయి. ఏపీలో మాత్రం 239.22 మిలియన్ యూనిట్ల డిమాండ్​కు గానూ కేవలం 217.11 మిలియన్ యూనిట్లను మాత్రమే సరఫరా జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం విద్యుత్ లోటు 24.23 మిలియన్ యూనిట్లు ఉంటే.. ఒక్కఏపీలోనే విద్యుత్ కొరత 22.21 మిలియన్ యూనిట్లుగా ఉందని దక్షిణాది ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్ గణాంకాలు చెబుతున్నాయి. విద్యుత్ లోటు కారణంగా కరెంటు కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వేసవి కారణంగా లోటు అనూహ్యంగా పెరిగిపోయిందని.. ఏపీ విద్యుత్ సంస్థలు చెబుతున్నా మిగతా రాష్ట్రాల్లో ఆ స్థాయి లోటు లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. అలాగే అధికారులు చెబుతున్నట్లు వేసవితో పాటు కొవిడ్ కారణంగా రాష్ట్రంలో వినియోగం పెరిగిందని అనుకుంటే... ఇదే కారణంతో మిగతా రాష్ట్రాల్లోనూ వినియోగం గరిష్ఠానికి చేరుకున్నా ఆయా రాష్ట్రాల్లో లోటు కేవలం సగటున 0.5 మిలియన్ లోపుగా మాత్రమే నమోదవుతోంది. తెలంగాణాలో లోటు కేవలం 0.49 మిలియన్ యూనిట్లు మాత్రంగానే లోడ్ డిస్పాచ్ సెంటర్​లో నమోదు అయ్యింది. వేసవిలో పెరిగిన డిమాండ్ కారణంగా లోటు ఉన్నప్పటికీ స్వల్పకాలిక విద్యుత్ ఒప్పందాలు, జాతీయ ఎక్స్చేంజి కొనుగోళ్ల ద్వారా లోటును దక్షిణాది రాష్ట్రాలన్నీ 1 మిలియన్ యూనిట్ల లోపులోనే ఉండేట్టు నిర్వహణ చేస్తున్నాయి. ఏపీలో మాత్రం నిధుల లేమి కారణంగా కొనుగోలు చేయకపోవటంతోనే ఈ లోటు 22.11 మిలియన్ యూనిట్లకు చేరుకుందని తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి రాత్రి 8 గంటల పీక్ అవర్స్ లో 3 వేల885 మెగావాట్ల మేర ఉత్పత్తి జరుగుతోంది. ఆఫ్ పీక్ సమయాల్లో 3 వేల 890 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. మొత్తం రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 91.8 మిలియన్ యూనిట్ల మేర ఉత్పత్తి అవుతోంది. సౌర, పవన విద్యుత్ , గ్యాస్ ఇతర యూనిట్ల నుంచి 134 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తోంది.

ఇదీ చదవండి: కరెంటు తీస్తున్న జగన్​ను.. జనం తీసేయబోతున్నారు : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.