ETV Bharat / city

POSOCO Letter to AP: 'మీవల్ల జాతీయ విద్యుత్ గ్రిడ్‌కే ప్రమాదం'..రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ లేఖ

author img

By

Published : Feb 5, 2022, 9:48 AM IST

POSOCO Letter to AP: 'మీవల్ల జాతీయ గ్రిడ్‌కే ప్రమాదం.. పరిమితికి మించి విద్యుత్‌ తీసుకుంటున్నారు' అంటూ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు పవర్‌ సిస్టం ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లేఖ రాసింది. ఈ పరిస్థితిని సర్దుబాటు చేయటానికి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో హెచ్చరించింది.

జాతీయ గ్రిడ్‌
Power Grid

Power Grid: రాష్ట్ర విద్యుత్‌ సంస్థల తీరుతో జాతీయ గ్రిడ్‌ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పొసోకో (పవర్‌ సిస్టం ఆపరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) హెచ్చరించింది. జాతీయ గ్రిడ్‌ నుంచి అనుమతించిన దానికంటే ఎక్కువ విద్యుత్‌ను రెండు రోజులుగా తీసుకుంటున్నాయని పేర్కొంది. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌కు పొసోకో లేఖ రాసింది. ఈ పరిస్థితిని సర్దుబాటు చేయటానికి తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

లేఖలో ‘రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు రెండురోజులుగా నిర్దేశించిన లోడ్‌ కంటే ఎక్కువ విద్యుత్‌ను జాతీయ గ్రిడ్‌ నుంచి తీసుకుంటున్నాయి. 3వ తేదీన 1,565 మెగావాట్లు, 4వ తేదీ ఉదయం 11.30 గంటల వరకు 1,485 మెగావాట్లు ఎక్కువ విద్యుత్‌ను తీసుకున్నాయి. ఇదే విషయాన్ని ప్రాంతీయ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఆర్‌ఎల్‌డీసీ) తెలిపింది. దీనివల్ల జాతీయ గ్రిడ్‌ ప్రమాదంలో పడుతుందన్న విషయాన్ని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని తక్షణం సరిచేసుకోవాలి’ అని పేర్కొంది.

దాంతోపాటు రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి సంబంధించిన సమస్యలను, ఎన్టీపీసీ బకాయిల విషయాన్నీ ప్రస్తావించింది. హిందుజా పవర్‌ కార్పొరేషన్‌ విషయాన్నీ చెప్పి.. ‘వీటన్నింటి వల్ల 2,240 మెగావాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్లు ఉత్పత్తిలో లేకుండా పోయాయి. వాటి నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుని యుద్ధప్రాతిపదికన ఉత్పత్తిలోకి తేవాలి. అప్పటివరకు జల విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుకోవాలి. జాతీయ విద్యుత్‌ గ్రిడ్‌ కోడ్‌ (ఐఈజీసీ) నిబంధనలకు లోబడే జాతీయ గ్రిడ్‌ నుంచి విద్యుత్‌ను తీసుకోవాలి’ అని పొసోకో పేర్కొంది. ఈ సమస్యను అధిగమించడానికి చేపట్టిన చర్యలను వెంటనే తెలపాలని పేర్కొంది.

ఇదీ చదవండి..

AP Proposal for Loan: రూ.2,000 కోట్ల రుణానికి ఏపీ ప్రతిపాదనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.