ETV Bharat / city

ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులుగా ఇద్దరు వైకాపా నేతలు

author img

By

Published : Oct 22, 2019, 9:35 PM IST

జీవీ సుధాకర్ రెడ్డి, ఎస్​. సలాంబాబులను ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

newly-two-members-appointed-as-appsc-memebers


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్​కు ఇద్దరు నూతన సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రెండు ఖాళీలను భర్తీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. నూతన సభ్యులుగా జీవీ సుధాకర్ రెడ్డి, ఎస్.సలాంబాబును నియమించారు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన జీవీ సుధాకర్ రెడ్డి వైకాపా సీనియర్ నేతగా ఉన్నారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నెకు చెందిన ఎస్.సలాంబాబు వైకాపా యువజన విభాగం నేతగా పని చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఏషియన్ సినిమా కార్యాలయాలపై దాడులు

Intro:Body:

ap_vja_40_22_appsc_members_nominated_dry_3052784_2210digital_1571748937_154


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.