ETV Bharat / city

కుప్పంలో గ్రానైట్​ అక్రమ మైనింగ్​పై ఎన్​జీటీ కీలక ఆదేశాలు..

author img

By

Published : Apr 27, 2022, 9:32 PM IST

చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతున్న గ్రానైట్​ అక్రమమైనింగ్​పై జాతీయ హరిత ట్రైబ్యునల్​ కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంతిపురం మండలం ముద్దానపల్లి గ్రామంలో సర్వే నంబర్ 104,213లలో జరుగుతున్న అక్రమ మైనింగ్​పై జాతీయ హరిత ట్రిబ్యునల్ పలు అదేశాలు ఇచ్చింది.

ఎన్​జీటీ
ఎన్​జీటీ

చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రానైట్ అక్రమ తవ్వకాలు, పర్యావరణానికి జరుగుతున్న నష్టం పై తెదేపా మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్​ కీలక ఆదేశాలు జారీ చేసింది. శాంతిపురం మండలం ముద్దాన పల్లి గ్రామంలో సర్వే నంబర్ 104, 213 లలో అక్రమ మైనింగ్ పై జాతీయ హరిత ట్రిబ్యునల్ పలు అదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ విభాగాలు ఇచ్చిన నివేదిక ప్రకారం అటవీ భూముల్లో మైనింగ్ జరుతోందని ఎన్​జీటీ నిర్థారించింది.

గ్రానైట్ అక్రమ రవాణా గురించి మాత్రమే ప్రస్తావించిన మైనింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్​కి పాల్పడుతున్న వారి పేర్లు, ఇతర వివరాలు తెలిపాలని ఆదేశించింది. ప్రతివాదులుగా ఉన్న చీఫ్ సెక్రటరీతో పాటు ఆయా శాఖల అధికారులు మైనింగ్ ప్రాంతాన్ని సందర్శించి.. శాస్త్రీయ పరిశీలనతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్ జరగకుండా, పర్యావరణానికి ఎటువంటి నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం.. ఉద్రిక్తత

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.