ETV Bharat / city

గౌతమ్ సవాంగ్ స్పందించలేదు.. డీజీపీకి ఎంపీ రఘురామలేఖ

author img

By

Published : Feb 20, 2022, 3:04 PM IST

mp raghurama letter to dgp: తనపై దాడి ఘటన విషయంలో దర్యాఫ్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నూతన డీజీపీని ఎంపీ రఘురామ కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఈ కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు.

dgp Rajendranath Reddy
dgp Rajendranath Reddy

mp raghurama letter to dgp: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తనపై సీఐడీ దాడి ఘటనపై త్వరితగతిన దర్యాప్తు జరపాలని కోరారు. దర్యాఫ్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు కేసులు పెట్టి తనను చిత్రహింసలకు గురిచేశారని అన్నారు. దాడి చేసిన వారిలో సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్ ఉన్నారని తెలిపారు. ఘటనపై స్పీకర్‌ ఓంబిర్లా నివేదిక కోరినా సవాంగ్‌ స్పందించలేదని వివరించారు. లోక్‌సభ స్పీకర్‌కు త్వరగా నివేదిక పంపాలని లేఖలో ప్రస్తావించారు. పోలీసు వ్యవస్థపై మళ్లీ విశ్వాసం కలిగిలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కోరారు.

"సీఐడీ దాడి ఘటనపై త్వరితగతిన దర్యాప్తు జరపాలి. దర్యాఫ్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి.నాపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. దాడి ఘటనపై స్పీకర్ ఓంబిర్లా నివేదిక కోరినా అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించలేదు.పోలీసు వ్యవస్థపై మళ్లీ విశ్వాసం కలిగిలా చర్యలు తీసుకోండి.నాపై దాడి ఘటన కేసు విషయంలో నిష్పక్షపాత దర్యాప్తు జరపాలి" - ఎంపీ రఘురామ, నర్సాపురం ఎంపీ

ఇదీ చదవండి

CM Jagan Kadapa tour : పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రారంభించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.