ETV Bharat / city

వీధి దీపాల సమస్యలపై ఫిర్యాదుకు మెుబైల్ యాప్: మంత్రి పెద్దిరెడ్డి

author img

By

Published : Jan 16, 2021, 9:30 AM IST

గ్రామాల్లో ఎల్​ఈడీ వీధి దీపాలపై ఫిర్యాదులను నమోదు చేయటానికి మెుబైల్ యాప్​ను అభివృద్ధి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

Minister Peddireddy Ramachandrareddy
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

గ్రామాల్లో ఎల్​ఈడీ వీధి దీపాలపై ఫిర్యాదులను నమోదు చేయటానికి మెుబైల్ యాప్​ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నంబరును కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఎల్​ఈడీ వీధి దీపాల నిర్వహణపై పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

గ్రామాల్లో ఎల్​ఈడీ వీధి దీపాలపై ఫిర్యాదులు అందిన 48 గంటల్లోగా సమస్య పరిష్కరించాలని మంత్రి చెప్పారు. వీధి దీపాల నిర్వహణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు భాగస్వాములు కావాలని దిశానిర్దేశం చేశారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎనర్జీ అసిస్టెంట్లను భాగస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు.

ఇదీ చదవండి:

'వైకాపాతో పోలీసులు కుమ్మక్కై విచ్చలవిడిగా అక్రమ కేసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.